Take a fresh look at your lifestyle.

ఎం‌త నష్టమోచ్చినా రైతుకు కష్టం కలిగించలే..

కరోనా వైరస్‌ ‌నేపద్యంలో రాష్ట్ర అర్థిక పరిస్థితి కుదేలైనా రైతులకు నష్టం కలిగించారాదన్న లక్ష్యంతో సిఎం కేసిఆర్‌ ‌పనిచేసి రైతుకు రుణం, దాన్యం కొనుగోలు కోసం నిధులను సమకూర్చారని రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం జగిత్యాల రూరల్‌ ‌మండలంలోని నర్సింగాపూర్‌లో నిర్వహించిన పల్లెప్రగతి, ఈజిఎస్‌లో చేపట్టిన కాలువల ఆదునీకరణ పనులను పరిశీలించిన ఆనంతరం కార్యక్రమములో హజరయ్యారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ సిఎం కేసిఆర్‌ ‌రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాడన్నారు. నిరంతర కరెంటుతోపాటు రైతులకు అవసరమైన సాగునీటి కోసం కాళేశ్వరం జలాలను తెచ్చి పంటపొలాలను పచ్చగా మార్చాడన్నారు. గత పాలకుల పాలనలో నేటి పాలనలో జరుగుతున్న అభివృద్దిని ప్రజలు పరిశీలించా)న్నారు. ఆనాడు ప్రతి దానికి రైతు రొడ్డెక్కిన పరిస్థితి నుంచి నేడు అన్ని రైతు ముంగిటకే వస్తున్నాయన్నారు. ప్రతి ఏటా పరిశ్రమలతో 15 వేల కోట్ల అదాయం వస్తుందని కరోనా ఎఫెక్ట్‌తో అదికాస్తా వందకోట్లకు చేరిందన్నారు. అయినా సిఎం చూస్తు ఉరుకోలేదని రైతులకు రుణసహయంతోపాటు పండించిన దాన్యం కొనుగోలుకై 30 వేల కోట్లను సమకూర్చారన్నారు. గత పల్లె ప్రగతిలో చేపట్టిన పారిశుద్ద్య కార్యక్రమాలు కాస్త కరోనా వైరస్‌ ‌విస్తరణను అడ్డుకొన్నాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉండె మురికినీరు, అపరిశుభ్ర ప్రాంతాలు వ్యాదులు సంక్రమించేందుకు దొహదపడతాయని కాని పల్లెప్రగతిలో చేపట్టిన పల్లెశుభ్రతతో కరోనా విస్తరణకు అడ్డుకట్టపడిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతదేహా లు కుప్పలుగా పడి ఉంటుంన్నాయని కాని తెలంగాణాలో చేపట్టిన పల్లె ప్రగతి కాస్తంత కరోనాను అడ్డుకుందన్నారు. ప్రజలు తప్పని సరిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఓక్కరు మాస్క్‌లను దరించకుంటే ము ప్పుతప్పదన్నారు. జగిత్యాల జిల్లాలో రోడ్ల అభివృద్దికి తాను కట్టుబడి ఉంటానని ఇదివరకు ఇచ్చిన ఐదుకోట్ల నిధులను వ్యయం చేసుకునేందుకు ఇక్కడే అధికారులకు అనుమతుల ను ఇస్తున్నాన్నారు. ఆలాగే ఇక్కడి నాయకుల్లో ప్రగల్బాలు పలికే వాళ్ళున్నారని పనిచేస్తే నైజం ఉన్న ఎమ్మెల్యే మీకు దొరికాడన్నారు. రాజకీయాల చిక్కులు తెలియని సంజయ్‌కుమార్‌ ‌మీకోసం ఉన్నాడని అయన అడిగితే ఎన్ని నిధులైన ఇచ్చి జగిత్యాల అభివృద్దికి పాటుపడతానన్నారు. సిఎం కేసిఆర్‌ ‌నిరంతరం ప్రజల సంక్షేమము కోసం పాటుపడుతున్నారని రానున్న సీజనల్‌ ‌వ్యాదులను అరికట్ట డానికే పల్లెప్రగతి స్పెషల్‌ ‌డ్రైవ్‌లో పారిశుద్ద్య కార్యక్రమాలకు ప్రాదాన్యతను ఇస్తున్నామన్నారు. ప్రజలందరు కరోనాపై జాగ్రత్తలు పాటిస్తు ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొవాలని మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈకార్యక్రమములో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ‌జడ్పి చైర్మన్‌ ‌దావవసంత, జిల్లా కలెక్టర్‌ ‌రవి, ఆగ్రామసర్పంచ్‌తోపాటు వివిధశాఖల అధికారులు, గ్రామస్తులు ఉన్నారు.

Leave a Reply