Take a fresh look at your lifestyle.

సీఏఏతో ఏ ఒక్కరికీ నష్టం కలగదు: రాజాసింగ్‌

సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. సీఏఏ చట్టం అమలుతో దేశంలోని ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై రాజాసింగ్‌ ‌మాట్లాడుతూ సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ నుంచి వెళ్లిపోతానని సవాల్‌ ‌విసిరారు. సీఏఏ, ఎన్‌పిఆర్‌పై ప్రతిపక్షాలు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

దేశానికి మేలు చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యమనీ, దీనిని గ్రహించకుండా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు. ఎన్‌పిఆర్‌, ‌సీఏఏ, ఎన్‌ఆర్‌సి చట్టాలతో దేశంలోని ఏ ఒక్క పౌరునికీ నష్టం వాటిల్లదని కేంద్ర హోం శాఖ అమిత్‌ ‌షా స్వయంగా ప్రకటించినప్పటికీ ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు, కాగా, రాజాసింగ్‌ ‌ప్రసంగిస్తుండగా మధ్యలో స్పీకర్‌ ఆయన మైక్‌ ‌కట్‌ ‌చేయడంతో సీఏఏ వ్యతిరేక తీర్మాన ప్రతులను చించి తన నిరసనను తెలియజేశారు.

Tags: CM KCR Assembly, country with NPR, CAA and NRC laws, Union Home Minister Amit Shah, no civilian casualties

Leave a Reply