Take a fresh look at your lifestyle.

‌జాతరలో కానరాని కరోనా వైరస్‌ ‌హెచ్చరిక

no coronavirus sign Boards in Medaram jathara

తెలంగాణ కుంభమేళ పేర్కొనబడు తున్నాయి సమ్మక్క సారలమ్మ మహా జాతర బుధవారం నుండి అధికారికంగా ప్రారంభమైంది ఈ జాతర కోసం దేశవ్యాప్త మే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు రావడం సర్వ సాధారణం. జాతర కోసం రాష్ట్ర నలుమూలల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సులలో, హైదరాబాద్‌ ‌నుండి మేడారం జాతర వరకు ప్రత్యేక హెలికాప్టర్‌ ‌జరిగింది దీంతోపాటుగా దక్షిణ మధ్య రైల్వే 15 కొత్త రైళ్లను జాతర కోసం నడిపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 20 వేల మంది కరోనా వైరస్‌ ‌కు లోని మృతి చెందినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నారు ఇంత జరుగుతున్నా తెలంగాణ జాతర మహా కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతరలో వైరస్‌ ‌హెచ్చరిక ఎక్కడ మచ్చుకైనా కానరావడం లేదని ప్రజలు అంటున్నారు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన చర్యలు పాటించాల్సిన సూచనలు వైద్య ఆరోగ్య శాఖ చెప్పాల్సింది.

అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ ‌నివారణకు మాంసాహారాన్ని నిషేధించడం జరిగింది దీని ద్వారా కరుణ వైరస్‌ ‌వ్యాప్తి ఆగుతుందో , ఆగ దో తెలవదు గాని జాతరలో మాంసాహారం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఒకపక్క ప్రపంచ దేశాలన్నీ వైరస్‌ ‌తో వణుకుతున్న మహా జాతర కుంభమేళ లో వైరస్‌ ‌సోకిన వారు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది విషయం మనకు తెలియదు గానీ! ఇంత పెద్ద మహా జాతర లో కట్టుదిట్టమైన నివారణ చర్యలు సూచనలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి బస్టాండ్‌ ‌లో ప్రయాణికులకు సూచనగా కూడా వైరస్‌ ‌వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన చర్యలు హెచ్చరిక బోర్డులు మచ్చుకైనా కనబడవు లేదు. ఇప్పటికే హైదరాబాదులో 50 మందికి వైరస్‌ ‌సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది ఏది ఏమైనప్పటికీ ఇంత తీవ్రమైన వైరస్‌ ‌నిరోధానికి పాటించాల్సిన సూచనలు పెద్ద పెద్ద హెచ్చరిక బోర్డులు పై ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ముఖ్యంగా భక్తులు తీసుకున్న ఆహారం ఏవిధంగా ఉండాలో సూచనలు కూడా చెప్పాల్సిన అవసరం అధికారులపై ఉంది. వైద్య అధికారులు ప్రసార మాధ్యమాలలో గాని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాటి ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!