రాష్ట్రంలో కొరోనా సెకండ్ వేవ్ లేదనీ, ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొరోనా సెకండ్ వేవ్‌పై సామాజిక మాథ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ కొరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు.
బ్రిన్ నుంచి రాష్ట్రానికి వస్తున్న వారిలో కొంత మందికి కొరోనా నిర్ధారణ అయిందనీ, స్ట్రెయిన్ నిర్ధారణ కోసం నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. తెలంగాణను కొరోనా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామనీ, ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానాలలో అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలను కల్పించినట్లు ఈ సందర్బంగా మంత్రి ఈటల వెల్లడించారు.