Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కరోనా లేదు : మంత్రి ఈటల

Don't neglect, Corona virus,Minister, Health, etela

ఇప్పటి వరకు రాష్ట్రంలో పరీక్షలు చేసిన వారెవరికీ కరోనా వైరస్‌ ‌నిర్దారణ కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌వెల్లడిం చారు. కరోనా వైరస్‌పై పత్రికలు, ఎలక్టాన్రిక్‌ ‌డియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అనవసర ఆందోళనలు కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా భయాలకు గురి కావద్దన్నారు. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినవారికి వైద్యపరీక్షలు నిర్వహించడం ఆలస్యమవు తండటంతో.. హైదరాబాద్‌ ‌గాంధీ ఆస్పత్రిలోనే వైద్యపరీక్షలు నిర్వహించేందుకు కేందప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో సోమవారం నుంచి ఇక్కడే వైద్యులు కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. రోజుకు 30 మందికి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన టెస్ట్ ‌కిట్లు కేంద్రం నుంచి వచ్చాయని తెలిపారు. ఈ పరీక్షల ద్వారా గంటలోపుగానే కరోనా వైరస్‌ ‌సోకిందో లేదో తెలుసుకొనే అవకాశం ఉందని చెప్పారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరికీ కరోనా వైరస్‌ ‌సోకలేదని కానీ విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి రాష్టాన్రికి వస్తున్నవారిలో ఎవరికైనా కరోనా వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానం కలిగితే, ఇతరులెవరికీ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని నగరంలో గాంధీ ఆసుపత్రి, ఫీవర్‌ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రులలో వైద్యపరీక్షలు చేయించుకోవాలాని మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ ‌వ్యాపించకుండా అన్ని ఆసుపత్రులలో , మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని, అలాగే వైద్య పరీక్షలు, సేవలు అందించేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వైద్యఆరోగ్యశాఖ అధికారులు నిరంతరం అన్ని ఆసుపత్రులలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు.

కనుక ప్రజలు కరోనా వైరస్‌ ‌గురించి వచ్చే పుకార్లను నమ్మవద్దని మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే కరోనా వైరస్‌ ‌దెబ్బకు కుదేలవుతున్న వుహాన్‌ ‌నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్రం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. రెండు ప్రత్యేక విమానల్లో భారత్‌కు తీసుకొచ్చిన 645 మందిలో ఏ ఒక్కరికీ వైరస్‌ ‌సోకలేదని పరీక్షల్లో తేలినట్లు వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, వారి నమూనాలను మరోసారి పరీక్షిస్తామని.. 14 రోజులు గడిచాక కూడా జాడ కనిపించకపోతేనే వైరస్‌ ‌సోకలేదని పూర్తిస్థాయిలో నిర్దారణ అవుతుందని తెలిపింది.

Leave a Reply