Take a fresh look at your lifestyle.

రక్షణరంగంలో రాజీ పడే ప్రసక్తి లేదు

దేశ భద్రత కన్నా ఏదీ ముఖ్యం కాదు
అటల్‌ ‌టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఆర్టీ, ప్రజల అవసరాలకు ఉపయోగపడనున్న టన్నెల్‌
‌దేశ భద్రతే తమ ప్రభుత్వానికి ముఖ్యమైన అంశమని, అంతకంటే ముఖ్యమైన అంశం తమకు మరొకటి లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అయితే రక్షణరంగంలో రాజీపడ్డ ఘటనలను కూడా ప్రజలు చూశారని, గత ప్రభుత్వాలపై మోదీ అన్యాపదేశంగా మండిపడ్డారు. సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ ఫలాలు కేవలం భద్రతా బలగాలకే అందవని, దేశంలోని సామాన్యులకు కూడా అందుతాయని ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన ’అటల్‌ ‌టన్నెల్‌’‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ…ఈ టన్నెల్‌ ‌పూర్తికావాలన్నది కేవలం అటల్‌ ‌బిహారీ వాజ్‌పాయ్‌ ‌కల మాత్రమే కాదని, హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌ప్రజల కల కూడా అని ఆయన అన్నారు. ఇంత శక్తిమంతమైన, ముఖ్యమైన టన్నెల్‌ ‌సరిహద్దుకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మరింత పటిష్ఠ పరుస్తుందన్నారు. కొత్త బలాన్ని చేకూరుస్తుందని ప్రకటించారు. కొత్త కొత్త సంస్కరణలను తేవడం ద్వారా సరికొత్త, అధునాత ఆయుధాలు దేశంలోనే తయారు చేసుకోడానికి వీలవుతుందని అన్నారు. చాలా కాలం తర్వాత మహాదళపతి బిపిన్‌ ‌రావత్‌ ‌కూడా మన వ్యవస్థలో భాగం అయ్యారని, భారత సైన్యానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సేకరించే విషయంలోనూ, ఉత్పత్తి చేసే విషయంలోనూ మంచి సమన్వయం ఏర్పడిందని మోదీ ప్రశంసించారు. ఈ టన్నెల్‌ ‌ప్రారంభం ప్రపంచస్థాయి సరిహద్దు కనెక్టివిటీకి ఓ ఉదాహరణగా నిలుస్తుందని ప్రకటించారు.

సరిహద్దు మౌలిక సదుపాయాలను పటిష్ఠపరిచాలన్న డిమాండ్లు చాలా కాలంగానే ఉన్నాయని, అయితే ప్రణాళిక దశలోనే ఆగిపోతున్నాయని, లేదా మధ్యలోనే ఆగిపోయాయని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్‌లోని ’కోసీ మహాసేతు’ నిర్మాణాన్ని కూడా వేగవంతంగా పూర్తిచేసి..జాతికి అంకితం చేశామని ఆయన గుర్తు చేశారు. చాలా తక్కువ వనరులున్నా సరే..దేశ జవాన్లు ఎలా పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా వివిధ యూనివర్శిటీలు ఈ టన్నెల్‌ను ఓ ‘కేస్‌ ‌స్టడీ’ గా అధ్యయనం చేయాలని అందుకు విదేశాంగ శాఖ ఓ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. అంతేకాకుండా ఈ టన్నెల్‌ను నిర్మించిన విధానం, చేసిన శ్రమను అధ్యయనం చేయడానికి వీలుగా ఇంజినీరింగ్‌ ‌విద్యార్థులకు అవకాశం కల్పించాలని కేంద్ర విద్యాశాఖను కూడా మోదీ ఆదేశించారు. టన్నెల్‌ ‌నిర్మాణం ప్రారంభించిన సమయంలో నిపుణులను అడిగితే…2040లో పూర్తవుతుందని నిపుణులు పేర్కొన్నారని, అయితే… కేవలం ఆరు సంవత్సరాల్లోనే దీనిని పూర్తి చేసి చూపించామని ఆయన పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న మిగితా ప్రాజెక్టులను కూడా ఇదే తరహాలో త్వరితగతిన పూర్తి చేస్తామని హావి• ఇచ్చారు. వ్యూహాత్మకంగా అత్యంత ప్రముఖమైన ‘దౌలత్‌ ‌బేగ్‌ ఓల్దీ ఏయిర్‌ ‌స్ట్రిప్‌’ 45 ఏళ్ల నుంచి మూసే ఉందని, దాని వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదని, అయితే దాని వెనకున్న దాగి వున్న వొత్తిళ్లేందని ప్రశ్నించారు. అనుసంధానించే పక్రియ అభివృద్ధి అన్న పక్రియకు నేరుగా సంబంధం ఉంటుందని, సరిహద్దు ప్రాంతంలో అనుసంధానించే పక్రియ కూడా భద్రతతో ముడిపడి ఉంటుందని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ (‌సిడిఎస్‌) ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌, ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఎంఎం ‌నారావణెళి, హిమాచల్‌ ‌ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ ‌మోదీ వెంట ఉన్నారు.

ఆస్ట్రియా టన్నెలింగ్‌ ‌విధానంలో నిర్మాణం
దాదాపు రూ.3,500 కోట్ల వ్యయంతో ఆస్ట్రియా టన్నెలింగ్‌ ‌విధానంలో దీన్ని నిర్మించారు. 9.02 కిలోవి•టర్ల అతి పొడవున నిర్మించిన ఈ టన్నెల్‌ ‌సముద్ర మట్టానికి 3,060 వి•టర్ల ఎత్తులో గుర్రపు షూ ఆకారంలో ఉంది. ఈ టన్నెల్‌ ‌ద్వారా మనాలీ నుంచి లద్దాఖ్‌లోని లేహ్‌ ‌వరకు దాదాపు 5 గంటల ప్రయాణ సమాయం తగ్గుతుంది. మనాలీ నుంచి లాహాల్‌-‌స్పితి లోయతో అనుసంధానించి నిర్మించిన ఈ సొరంగ మార్గం వల్ల శీతాకాలంతో పాటు అన్ని కాలాల్లో ఏడాది పొడవునా ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు కల్పించినట్లయ్యింది. రోజుకు 3,000 కార్లు, 1,500 ట్రక్కులు ఈ టన్నెల్‌ ‌గుండా ప్రయాణంచివచ్చు. ప్రతీ వాహనం గరిష్టంగా 80 కిలోవి•టర్ల వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు వెల్లడించారు. కీలకమైన పాక్‌, ‌చైనా సరిహద్దులో సియాచిన్‌ ‌గ్లేసియర్‌, అక్సాయ్‌ ‌చిన్‌లలో మన సైనికులు నిరంతర పహరా కాస్తున్నారు. వారికి ఆహార పదార్థాలను, ఆయుధాలను, ఇతర సామగ్రిని తీసుకెళ్లడం చాలా కష్టతరంగా ఉండేది. ఈ నేపథ్యంలో రోహతాంగ్‌ ‌పాస్‌ ‌కింద సొరంగం నిర్మించాలని అప్పటి ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి నిర్ణయించారు. దీనికి అనుగుణంగా జూన్‌ 3, 2000 ‌న దక్షిణ ముఖ ద్వారానికి శంకుస్థాపన చేశారు. అత్యంత కష్టతరమైన విస్తీర్ణాన్ని కలిగి ఉన్నఈ ప్రదేశంలో భౌగోళిక ,వాతావరణ సవాళ్లను అధిగమించడానికి బోర్డర్‌ ‌రోడ్స్ ఆర్గనైజేషన్‌(‌బీఆర్‌వో) అవిశ్రాంతంగా పనిచేసింది. వాజ్‌పేయి చేసిన కృషికి గుర్తుగా రోహతాంగ్‌ ‌టన్నల్‌కు అటల్‌ ‌టన్నల్‌ అని పేరు పెట్టాలని కేంద్ర కేబినెట్‌ 2019‌లో నిర్ణయించింది.

Leave a Reply