Take a fresh look at your lifestyle.

ఇళ్లపట్టాలు రాలేదన్న ఫిర్యాదు రాకూడదు

8న పట్టాల పంపిణీ సక్రమంగా సాగాల్సిందే
అధికారులకు దిశానిర్దేశం చేసిన సిఎం జగన్‌

అమరావతి,జూన్‌ 23 : ‌జూలై 8న ఎట్టి పిరస్థితుల్లోనూ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 29-30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాల వారీగా ఇళ్లపట్టాలపై పరిస్థితిని సక్షించారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భూసేకరణ, పొజిషన్‌, ‌ప్లాట్ల అభివృద్ధి ద నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ కావాలని, కచ్చితంగా ఇళ్లపట్టాలు పంపిణీ కావాలన్న విషయాన్ని పదేపదే గుర్తుంచుకోవాలని సిఎం పదేపదే సూచించారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ పక్రియ వెంటనే పూర్తి కావాలి. ఇళ్ల పట్టాల లబ్దిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. కోవిడ్‌ ‌పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత గ్రామాల్లో పర్యటిస్తాను.

ఇంటిపట్టా లేదని ఎవ్వరూ చేయి ఎత్తకూడదని’ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌స్పష్టం చేశారు. పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని సీఎం పేర్కొన్నారు. సరైన కారణంగా లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులను బాధ్యులను చేస్తానని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటిపట్టా ఇవ్వాలన్నారు.  తనకు ఓటు వేయని వారికి కూడా ఇళ్లపట్టా ఇవ్వాలని సీఎం తెలిపారు. పెన్షన్‌ ‌కార్డుకు 10 రోజులు, రేషన్‌ ‌కార్డుకు 10 రోజులు, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజులు, ఇంటి పట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందాలన్నారు. ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను తయారుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. వివక్ష లేకుండా, సంతృప్తస్థాయిలో అందాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌స్పష్టం చేశారు. సక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, ‌సిఎస్‌ ‌నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply