Take a fresh look at your lifestyle.

తెలంగాణలో భూస్వాములు లేనేలేరు  

*భూమి ఉన్నపేదలకు అండగా కొత్త రెవెన్యూ చట్టం
*తెలంగాణలో భూస్వాములు లేనేలేరు
*రెవెన్యూ బిల్లువల్ల భూస్వాములకు లాభం
*అనుభవదారు కాలమ్‌ ఎత్తేసామని వెల్లడి
*ప్రభుత్వం వద్ద పక్కాగా భూముల వివరాలు
*అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు ప్రవేశ పెట్టిన సిఎం కెసిఆర్‌

‌భూమిని నమ్ముకుని బతుకుతున్న పేదలకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకుని వచ్చామని సిఎం కెసిఆర్‌ ‌పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు  లేరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శాసనమండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడారు. కొంతమంది నాయకులు బయట అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఈ బిల్లు వల్ల భూస్వాములకు లాభం జరుగుతుందని అంటున్నారు. కానీ తెలంగాణలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు  లేరని సీఎం తేల్చిచెప్పారు. ఇది కఠోర సత్యమని అని సీఎం అన్నారు. తెలంగాణలో ఉన్నదంతా మూడెకరాల లోపు ఆసాములేనని అన్నారు. వారికి అండగా  నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకే భూముల్లో అనుభవదారు కాలమ్‌ ఎత్తేశామని, దానితో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఇకపోతే అందరూ ఆందోళన చెందుతున్నట్లుగా రాష్ట్రంలోని రిజిస్టేష్రన్‌ ‌కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారమే లేదని సీఎం కేసీఆర్‌ ‌తేల్చిచెప్పారు. గత ప్రభుత్వాలు వీఆర్వోలకు అనవసర అధికారాలు ఇవ్వడంతో అరాచకాలకు పాల్పడ్డారని సీఎం గుర్తు చేశారు. ఈ క్రమంలో వీఆర్వోలను రద్దు చేసి కఠిన నిర్ణయాలను తీసుకున్నామని తెలిపారు. ధరణి పోర్టల్‌ ‌ద్వారా ఇకపై తహసీల్దార్లు కూడా అవినీతికి పాల్పడే అవకాశమే లేదన్నారు. ధరణి పోర్టల్‌లో మార్పులకు తహసీల్దార్‌కు అవకాశం లేదన్నారు. సబ్‌ ‌రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణా అధికారం లేదన్నారు. పది నిమిషాల్లోనే రిజిస్టేష్రన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తామని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply