- స్పష్టం చేసిన పిసిసి ఛీఫ్ ఉత్తమ్
- ఎన్నికల్లో వ్యూహంపై• సన్నాహక సమావేశంలో చర్చ
రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పొత్తులు అంటే ఎన్నికల వరకు సీట్ల పంచాయితీ తెగదని అన్నారు. మంగళవారం ఇందిరభవన్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ సన్నాహక మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ….కాంగ్రెస్ పార్టీకి సొంతంగా పోటీ చేసే సత్తా ఉందని, అన్ని డివిజన్ లల్లో సొంత పార్టీ నేతలకే టిక్కెట్లు ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీ అధక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ రేవంత్ రెడ్డి, నాయకులు విహెచ్, మర్రి శశిధర్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, కుసుమ కుమార్, దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, ఫిరోజ్ ఖాన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
సమావేశం లో రభస:
ఇక గాంధీభవన్‌లో జరిగిన జిహెచ్ఎంసీ సన్నాహక సవేశంలో రభస చోటుచేసుకుంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కు టీపీసీసీ కార్యదర్శి నిరంజన్‌లకు మధ్య గొడవ జరిగింది. ఇద్దరు నేతలు బూతులు తిట్టుకున్నారు. దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతు జిహెచ్ఎంసీ ఎన్నికలో పార్టీ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డికి సలహాలు ఇస్తున్న సమయంలో సమయంలో నిరంజన్ తమకు తెలుసునని కలుగచేసుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిన్నట్లు సమాచారం. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కలుగచేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.