Take a fresh look at your lifestyle.

గ్రేటర్ ఎన్నికలో ఎవరితో పొత్తు ఉండదు..పీ సి సి చీఫ్ ఉత్తమ్ 

* గ్రేటర్ ఎన్నికల వ్యూహం పై చర్చ 
రానున్న  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.పొత్తులు అంటే ఎన్నికల వరకు  సీట్ల పంచాయితీ తెగదని అన్నారు.మంగళవారం ఇందిరభవన్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ సన్నాహక మీటింగ్ లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ….కాంగ్రెస్ పార్టీ కి  సొంతంగా పోటీ చేసే సత్తా ఉందని అన్ని డివిజన్ లల్లో సొంత పార్టీ నేతలకే టిక్కెట్లు ఇస్తామని తెలిపారు.ఈ సమావేశంలో పీసీసీ అధక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ రేవంత్ రెడ్డి, నాయకులు వి.హెచ్, మర్రి శశిధర్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, కుసుమ కుమార్, దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, ఫిరోజ్ ఖాన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
జిహెచ్ఎంసీ   ఎన్నికల సన్నాహక సమావేశం లో రభస
ఇక గాంధీభవన్ లో జరిగిన జిహెచ్ఎంసీ సన్నాహక సవేశంలో రభస చోటుచేసుకుంది..ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కు౼టీపీసీసీ కార్యదర్శి నిరంజన్ మధ్య గొడవ జరిగింది.ఇద్దరు నేతలు బూతులు తిట్టుకున్నారు.దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతు జిహెచ్ఎంసీ ఎన్నికలో పార్టీ  కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కి  సలహాలు ఇస్తున్న సమయంలో  సమయంలో నిరంజన్ మాకు తెలుసు అని  కలుగచేసుకోవడం తో ఇద్దరిమధ్య గొడవ జరిగిన్నట్లు సమాచారం.దింతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కలుగచేసుకోవడం తో సద్దుమణిగింది..

Leave a Reply