Take a fresh look at your lifestyle.

ఈ ఏడాది అలయ్‌ ‌బలయ్‌ ‌లేదు హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌దత్తాత్రేయ

కొరోనా ఉధృతి కొనసాగుతుండటం, హైదరాబాద్‌ ‌నగరంలో వరద బీభత్సం కారణంగా ఈ ఏడాది అలయ్‌ ‌బలయ్‌ ‌కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈమేరకు శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రతీ ఏటా దసరా పండుగ తరువాతి రోజుల హుస్సేన్‌ ‌సాగర్‌ ‌వొడ్డున నక్లెస్‌ ‌రోడ్‌లో దత్తాత్రేయ అలయ్‌ ‌బలయ్‌ ‌పేరుతో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కవులు, కళాకారులు, ప్రముఖులను ఆహ్వానించి విందు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది..

ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక చిహ్నాన్ని ప్రతిబింబించే విధంగా నిర్వహించే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. అయితే, ప్రస్తుతం ఇంకా కొరోనా ఉధృతి కొనసాగుతుండటం, హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవన అస్థవ్యస్థమైన నేపథ్యంలో ఈసారి అలయ్‌ ‌బలయ్‌ ‌నిర్వహించడం లేదని ఆయన పేర్కొన్నారు. కొరోనా కారణంగా ప్రజలంతా దసరా పండుగను ఇంటి వద్దనే జరుపుకోవాలని ఆయన సూచించారు.అయితే, వచ్చే ఏడాది వరకూ పరిస్థితులన్నీ చక్కబడతాయనీ, అప్పుడు ఆనందోత్సాహాల నడుమ అందరం కలసి పండుగ చేసుకుందామని దత్తాత్రేయ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply