Take a fresh look at your lifestyle.

అ‌క్రమ ఇసుక తవ్వకాలపై చర్యలేవీ

ట్విట్టర్‌ ‌వేదికగ ప్రశ్నించిన దేవినేని
విజయవాడ,ఆగస్ట్15 : ‌కృష్ణా జిల్లాలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ట్వీట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ… కృష్ణానదీ గర్భంలో ప్రొక్లైన్‌లు పెట్టి వందలాది లారీలతో లక్షల టన్నుల ఇసుక దోపిడికి పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నదిలో మెటల్‌ ‌రోడ్లు వేస్తున్నారు. అర్ధరాత్రివేళ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు.

నేతల జేబులు నింపేందుకు ప్రజల ప్రాణాలను ఫణంగా పెడతారా? చెవిటికల్లు నుండి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న  నేతలపై చర్యలేవి? వైఎస్‌ ‌జగన్‌ అం‌టూ దేవినేని ట్వీట్‌ ‌చేశారు. కృష్ణా జిల్లాలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలన్నారు. వంద లాది లారీలతో లక్షల టన్నుల ఇసుక దోపిడీ. నిబంధ నలకు విరు ద్ధంగా నదిలో మెటల్‌ ‌రోడ్లు, అర్ధరాత్రి వేళ తవ్వ కాలు.  నేతల జేబులు నింపేందుకు ప్రజల ప్రాణాలను ఫణంగా పెడతారా అంటూ దేవినేని ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply