Take a fresh look at your lifestyle.

ఓబీసీ గురకుల్‌ ‌స్కూల్స్ ఏర్పాటుకి చర్యలేం లేవు

దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులకి రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు ప్రారంభించడం లేదని పార్లమెంటుకు కేంద్రం స్పష్టం చేసింది. మహారాష్ట్రకి చెందిన బీజేపీ ఎంపీ భగద్వద్‌ ‌కరద్‌ అడిగిన ప్రశ్నకి రాజ్యసభలలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి క్రిషన్‌ ‌పాల్‌ ‌గుర్జర్‌ ‌సమాధానం ఇచ్చారు.

తాము ఈ విషయంపై ఇంకా దృష్టి పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ఫ్రాథమిక విద్యా – అక్షరాస్యత విభాగానికి సంబంధించిన జవహర్‌ ‌నవోదయ స్కూళ్ళలలో ఆరోవ తరగతి నుంచి ఓబీసీ విద్యార్థులకి 27 శాతం రిజర్వేషన్‌ 2020-21 ‌విద్యా సంవత్సరం నుంచి ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.

Leave a Reply