Take a fresh look at your lifestyle.

దేశాన్ని వణికిస్తున్న నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌

లాక్‌ ‌డౌన్‌తోనే మహమ్మారి వైరస్‌ను నియంత్రించామనుకుంటున్న తరుణంలో కన్యాకుమారి నుండి హిమాచలం వరకు మరోసారి మర్కజ్‌ ‌సమావేశాలు దేశాన్ని హడలగొట్టిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా అక్కడక్కడా ఈ వ్యాధి లక్షణాలున్నవారు దోబూచులాట మరెంత ప్రమాదకారిగా మారుతుందోనన్న భయం అందరినీ ఆందోళనలో పడేస్తోంది. చాలా సేఫ్‌గా బయటపడుతామనుకుంటే ఊహాతీతంగా ఈ ఉపద్రవం ఇలా ముంచుకొస్తుంది. దీంతో నిన్నమొన్నటి వరకు ఒక్కటంటే ఒక్క పాజిటివ్‌ ‌కేసు కూడా వెలుగులోకి రాని జిల్లాల్లో కూడా ఇప్పుడు భయం అందుకుంది. మర్కజ్‌ ‌తబ్లిజ్‌ ‌ప్రార్థనలో పాల్గొన్న వారు దేశవ్యాప్తంగా వెళ్ళడమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఈ ప్రార్థనల్లో విదేశాల నుండి వచ్చినవారితోనే ఈ ప్రమాదం ఏర్పడింది. వారితో సన్నిహితంగా మెదిలిన మన దేశస్తులు తమకు తెలియకుండానే అన్ని జిల్లాలకు దీన్ని అంటించారు. ఫలితంగా తాజాగా జరుగుతున్న మరణాలను పరిశీలిస్తే మృతులంతా ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ‌ప్రార్ధనల్లో పాల్గొని వచ్చినవారేనన్నది ధృవపడింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాముద్దీన్‌ ‌ప్రార్థనలో పాల్గొన్నవారి వేటలోపడింది. అంతేకాదు, వారు తమ స్వంత ప్రాంతాలకు చేరినప్పటి నుండి ఎవరెవరితో కలిసింది ఆరాతీసేపనిలో పడ్డాయి.

నిజాముద్దీన్‌ ‌ప్రార్థనలో పాల్గొన్నవారందరికి దాదాపుగా పాజిటివ్‌ ‌రావడంతో వారిని స్వచ్ఛందంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇంకా కొందరు బయటికి రాకుండా దాగుడు మూతలు ఆడుతున్నారు. అదే ఇప్పుడు ప్రమాదకారిగా మారుతుందన్న భయం ప్రజల్లో ఉంది. ఈ ప్రార్థనా సమావేశాల నిర్వహణలో ప్రధానపాత్ర వహించిన మౌలానా సాద్‌ ‌కంధాల్వీ ప్రభుత్వ మాటను పెడచెవినపెట్టి అజ్ఞాతవాసం గడపడం కూడా ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చగా మారింది. ఆ సమావేశంలో పాల్గొన్న వారిలాగానే ఆయనకు కూడా కరోనా వైరస్‌ ‌సోకిందా లేదా అన్నది తెలియకుండా పోయింది. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని దాదాపు ప్రధాన దవాఖానాలన్నీ గాలిస్తున్నారు. అయితే తానుమాత్రం డాక్టర్‌ ‌సలహాతో సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు ఆయన ఓ ఆడియో క్లిప్‌లో తెలిపినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే మర్కజ్‌ ‌మసీదులో పాల్గొన్నవారికి పాజిటివ్‌ ‌రావడం, తాజాగా మృతిచెందుతున్న వారు కూడా వీరే అవడంతో ఆ మసీదును అధికారులు మూసివేయడంతో పాటు నిర్వాహకులపై కేసులు నమోదుచేసి, అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రార్థనల్లో దాదాపు రెండు వేలమంది పాల్గొనగా వీరిలో దాదాపు 280 మంది వరకు విదేశీయులే కావడం విశేషం. ఈ సమావేశానికి తెలంగాణ నుండి కూడా పెద్ద సంఖ్యలోనే పాల్గొన్నారు.

వీరిలో ప్రతీ జిల్లాకు చెందినవారుండడం ఇప్పుడు పెద్దగా కలవరపరుస్తున్న విషయం. విదేశాల నుండి వచ్చేవారిని, అంతర్‌ ‌రాష్ట్ర రాకపోకలను కట్టడిచేసిన ప్రభుత్వం ఇప్పటి వరకున్న పరిస్థితిని బట్టి ఏప్రిల్‌ ఏడవ తేదీ వరకు దీన్ని పూర్తిగా కట్టడిచేసే అవకాశాలున్నట్లు చెప్పుకొచ్చింది. కాని, ఈ మావేవాలకు వెళ్ళివచ్చినవారు ఒకేసారి ఆరుగురు మరణించడంతో మరికొంతకాలం లాక్‌డౌన్‌ ‌పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడనుందనిపిస్తున్నది. నిన్నటివరకు ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా ఇప్పుడు భయపడిపోతున్నది. ఈ జిల్లాకు చెందిన 33 మందిని కొరోనా అనుమానితులుగా గుర్తించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఒక్కసారే షాక్‌కు గురవుతున్నారు. వీరంతా దాదాపుగా ఢిల్లీ నిజాముద్దీన్‌ ‌ప్రార్థనలకు వెళ్ళివచ్చినవారే కావడంతో మరింత ఆందోళనను కలిగిస్తున్న విషయం. వీరందరిని గురువారం రాత్రి వరంగల్‌ ఎం‌జిఎం ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పటివరకు ములుగు జిల్లాకు చెందిన ఇద్దరికి, ఏటూరునాగారంలో ఒకరికి, పస్రాకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ అని తేలినట్లు అధికారవర్గాలద్వారా తెలుస్తున్నది. ఇంతకు క్రితం జనగామ జిల్లా వెల్దండకు చెందిన ఒక వ్యక్తికి కొరోనా పాజిటివ్‌ ‌రావడంతో అతన్ని కూడా ఎంజిఎంలో చేర్చారు. కాగా వరంగల్‌ ఆర్బన్‌ ‌జిల్లాకు చెందిన 19 మందిని ఈ వ్యాధి అనుమానితులుగా గుర్తించి పరీక్షలు వీరంతా ఇప్పటివరకు ఎంతమందిని కలిశారు. వారి బంధువులు, కుటుంబసభ్యులు, నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే ఇప్పుడు వరంగల్‌ ‌ప్రజ)ను భయపెడుతున్న అంశం. కాగా స్నేహితులతోపాటు ఇంకా ఎవరెవరిని కలిశారన్న విషయంలో అధికారులు ఆరాతీస్తున్నారు. ఇక్కడ ఏర్పడుతున్న ఉద్రిక్తత కారణంగా మొత్తం జిల్లానే దిగ్భంధం చేసే ఆలోచన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Leave a Reply