Take a fresh look at your lifestyle.

నిజామాబాద్‌ ‌స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం

వందశాతం పోలింగ్‌ ‌నమోదు
వోటేసిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
12న కౌంటంగ్‌..అదేరోజు ఫలితం

‌నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ‌ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ‌నిర్వహించారు. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి 50 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతనకర్‌ ‌లక్ష్మీనారాయణలు బరిలో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ విప్‌ ‌గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు గణెళిష్‌ ‌బిగాల, బాజిరెడ్డి గోవర్దన్‌, ‌జీవన్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, రాజేశ్వర్‌, ‌వీజీగౌడ్‌ ‌తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, అంతకు ముందు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డిలో పర్యటించారు.

స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ‌తో కలిసి స్థానికంగా పోలింగ్‌ ‌సరళిని పరిశీలించారు. అక్కడి మున్సిపల్‌ ‌కార్యాలయంలోని పోలింగ్‌ ‌బూత్‌లో వోటింగ్‌ ‌సరళిని పరిశీలించారు. అనంతరం బోధన్‌కు వెళ్లి, అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌తో కలిసి స్థానికంగా పోలింగ్‌ ‌సరళిని పరిశీలించారు. బోధన్‌ ‌మండల ప్రజా పరిషత్‌ ‌కార్యాలయంలోని పోలింగ్‌ ‌బూత్‌ల వోటింగ్‌ ‌సరళిని పరిశీలించారు. వోటు హక్కు వినయోగించుకునే క్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌ ‌క్యాంప్‌ ‌నుంచి నిజామాబాద్‌ ‌చేరుకున్నారు. జిల్లా పరిషత్‌ ‌పోలింగ్‌ ‌కేంద్రంలో కార్పొరేటర్లంతా వోటు వేశారు. బ్యాలెట్‌ ‌పద్దతిలో ఉపఎన్నిక పోలింగ్‌ ‌జరిగింది. కొవిడ్‌ ‌మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్‌ ‌నిర్వహణను చేపట్టారు. ఎక్స్అఫీషియో సభ్యులు, ప్రజాప్రతినిధులు వోటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వోటేశారు. చివరి గంటలో కొరోనా పాజిటివ్‌ ‌వచ్చిన ప్రజా ప్రతినిదులు  ఓట్లు వేసారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసినట్లు పోలీసులు ప్రకటించారు. ఫలితాలు ఈ నెల 12న ప్రకటించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply