- సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
- చెరుకు రైతుల అసెంబ్లీ ముట్టడి
- తమ సమస్యలు పరిష్కారించాలంటూ పలు వర్గాల ముట్టడి
- ఉద్రిక్త పరిస్థితి..పలువురి అరెస్ట్
రాష్ట్ర అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల జిల్లా రైతులు యత్నించారు. ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, అసెంబ్లీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీపై తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హావి•ని నిలబెట్టుకోవాలన్నారు. రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవాలని అసెంబ్లీ ముట్టడికి వొచ్చిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల, కోరుట్ల ప్రాంతం నుంచి వందాలాది మంది రైతులు అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హావి•లతో పాటు, ప్రజల సమస్యలను గాలికి వదిలేసారని ఆరోపించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముట్టడికి యత్నించిన వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పలు రాజకీయ పార్టీలు యత్నించాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీలను వోటు బ్యాంకుగా వాడుకొని వొదిలేసిందని, అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే ఏర్పాటు చేసి ఎస్సీలకు ఇచ్చిన హావి•లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అసెంబ్లీ ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఇంకా రెండు రోజులే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాల నుండి ప్రజలు అసెంబ్లీ ముట్టడికి వొస్తున్నారు. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ వేములవాడ ప్రజలు మరోమారు అసెంబ్లీని ముట్టడించారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సస్పెండ్ చేయలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. అలాగే కరీంనగర్ మిడ్ మనేరు ప్రాజెక్ట్‌కు రూ.100 కోట్లు నిధులు, కొండగట్టు అభివృద్ధికి నిధులు, వేములవాడ అభివృద్ధికి నిధులు కేటాయించాలంటూ కాంగ్రెస్ కిసాన్ అసెంబ్లీని ముట్టడించింది.
అసెంబ్లీ ముట్టడికి వొచ్చిన పొన్నం ప్రభాకర్…సీఎం కేసీఆర్ ఇచ్చిన హావి•లన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యంపేట్ నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని జగిత్యాల జిల్లా రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి వస్తూ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.