Take a fresh look at your lifestyle.

నివేదన యాప్‌ ‌ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తుంది : కలెక్టర్‌

Nivedhana App Will provides an immediate solution Bhadradri Collector rajath kumar

‌భద్రాచలం(కొత్తగూడెం),జనవరి 17 (ప్రజాతంత్ర ప్రతినిధి) : నివేదన యాప్‌ ‌ద్వారా చేసిన ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ ‌రజత్‌ ‌కుమార్‌ ‌శైనీ అన్నారు. డిఆర్‌డిఏ సమావేశ మందిరంలో శుక్రవారం నివేదన యాప్‌పై రెవెన్యూ ఇరిగేషన్‌ ‌వైద్య , యంపిడిఓలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. యాప్‌ ‌ద్వారా వచ్చిన సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో కలెక్టర్‌ ‌వివరిం చారు. యాప్‌ ‌సుదూర ప్రాంతాల నుండి ప్రజలు సమస్యలను తెలియపరుచుటకు జిల్లా కేంద్రానికి రావాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదని ఇంత దూరం రాకుండా ఇంటి వద్దనే ఉండి సమస్యను పరిష్కరించేకునే విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అధికారులు వారి సమస్యను తక్షణం పరిష్కరిం చటం వలన ప్రజల్లో నమ్మకం కలుగుతుందని చెప్పారు. ప్రజా సమ స్యను పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు కాలయాపనతో పాటు డబ్బు కూడ వృదాకాదన్నారు. ఎల్‌1 అధికారులుగా గ్రామ స్థాయి అధికారులను ఎల్‌2 అధికారులుగా మండల స్థాయి , ఎల్‌3 అధికారులు జిల్లా స్థాయి అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎల్‌ 1 అధికారులుగా గ్రామస్థాయిలోని అధికారులను, ఎల్‌2 అధికారులుగా శాఖ అధికారులను తహశీల్దారులను మండల పరిషత్‌ అభివృద్ది అధికారులు , ఇంజనీరింగ్‌ ‌శాఖలకు సంబంధిత ఏఇలు వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ ఏఇఓ , ఏఓఇ ఎంఇలు , ఎంపిఓలను నియమించాలని వారందరు ఏడు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని , నిర్ధేశిత సమయంలో పరిష్క రించకపోతే ఎల్‌3 ‌స్థాయి అధికారులకి చేరుతుందని చెప్పారు. నివేదన యాప్‌పై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యాప్‌ ‌డౌన్‌లోడ్‌ ‌చేయు విధంగా చూడాలని చెప్పారు. గ్రామం నుండి 30 నుండి 50 మం ది యాప్‌ ‌డౌన్లోడ్‌ ‌చేయు విధంగా సిబ్బందికి లక్ష్యాలను నిర్ధేశించాలని చెప్పారు.

ఇందు• •రకు గ్రామ స్థాయిలో పంచాయితీ కార్యదర్శులు వ్యవసాయశాఖ అధికారులు మీసేవా, రేషన్‌ ‌షాపు,డీలర్లకు లక్ష్యాలు ఇవ్వాలన్నారు. నివేదన యాప్‌ ‌ద్వారా చేసిన పిర్యాదు అందినట్లు ఫిర్యాదు దారునికి ఫోన్‌ ‌చేయాలని అప్పుడే ప్రజలకు యాప్‌ ‌వినియోగం పట్ల నమ్మకం కలుగుతుందని చెప్పారు. నివేదన యాప్‌ ‌ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించాలని చాలా సార్లు చెప్పినప్పటికి విద్యాశాఖతో పాటు రెవెన్యూ అధికారులు అలసత్వం వహి స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. గ్రామ మండల స్థాయిలో ప్రజా ప్రతినిధులు కూడ యాప్‌ ‌డౌన్‌లోడ్‌ ‌చేయు విధంగా వారిని కోరాలని చెప్పారు. స్మార్ట్ ‌ఫోన్‌ ‌లేని వారి కొరకు ప్రత్యేకంగా కలెక్టర్‌ ‌కార్యాలయంలో 08744 241950 నెంబర్‌తో కంట్రోల్‌ ‌రూము ఏర్పాటు చేసామని కార్యాలయ పని దినాల్లో ఫోన్‌ ‌చేసి ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమంలో జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు, భద్రాచలం సబ్‌కలెక్టర్‌ ‌భవేశ్‌ ‌మిశ్రా, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఐలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్‌ అనుదీప్‌, ఆర్డిఓ స్వర్ణలత, వైద్యాఆరోగ్యశాఖ అధికారులతో పాటు అన్నీ మండలాల తహ శీల్దారు, యంపిడిఓలు పాల్గొన్నారు.

Tags: drda meeting, Nivedhana App, provides, immediate solution, Bhadradri Collector rajath kumar

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply