Take a fresh look at your lifestyle.

మరోమారు బీహార్‌ ‌సిఎంగా నితీశ్‌ ‌ప్రమాణం

బిహార్‌ ‌ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్‌ ‌కుమార్‌ ‌సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత  రాష్ట్ర గవర్నర్‌ ‌ఫగు చౌహాన్‌ ‌ప్రమాణ స్వీకారం చేయించారు. పాట్నాలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 4.30 గంటలకు నితీశ్‌ ‌ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. బిహార్‌ ‌ముఖ్యమంత్రిగా నితీష్‌ ‌వరుసగా నాలుగోసారి ప్రమాణం చేశారు. మొత్తంగా ఏడోసారి.

15 ఏళ్లుగా బిహార్‌ ‌ముఖ్యమంత్రిగా పని చేస్తున్న నితీష్‌, ‌తాజాగా జరిగిన ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ముందుగా చెప్పినట్లుగానే నితీష్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. బీజేపీకి చెందిన రేణు దేవి, థార్‌ ‌కిషోర్‌లు బిహార్‌ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Leave a Reply