Take a fresh look at your lifestyle.

నిరర్థక సంస్థగా నీతి ఆయోగ్‌

‌భజన బృందంగా మారింది
నేటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నా
సిఫార్సులును తుంగలో తొక్కారు
మిషన్‌ ‌కాకతీయ, భగీరథలకు పైసా ఇవ్వలేదు
నీతి ఆయోగ్‌లో చర్చించే అవకాశం లేదు
ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం విధానాలు
వి•డియా సమావేశంలో కేంద్రంపై నిప్పులు చెరిగిన కెసిఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 6 : ‌నేడు దిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ ‌సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ ద్వారా తన నిరసన తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ ‌లక్ష్యాలను దెబ్బతీసి దానిని భజన బృందంగా తయారు చేయడమే గాకుండా, దానికి ఓ స్వయంప్రతిపత్తి లేకుండా, అభిప్రాయాలకు అవకాశం లేకుండా చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రగతిభవన్‌లో జరిగిన వి•డియా సమావేశంలో సిఎం వెల్లడించారు. మిషన్‌ ‌భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్‌, ‌మిషన్‌ ‌కాకతీయకు రూ. 5 వేల కోట్లు గ్రాండ్‌ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ‌సిఫార్సు చేసినా ఆ సిఫార్సులను కేంద్ర పట్టించుకోలేదని, మిషన్‌ ‌కాకతీయ, మిషన్‌ ‌భగీరథ పూర్తయినా ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపు విషయంలో గందరగోళం ఉందని, ఉద్ధేశ్యపూర్వకంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీకి రాసిన లేఖలో కేంద్ర విధానాలపై కేసీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్‌ ‌స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్ర కొత్త నిబంధన తీసుకొచ్చిందన్న కేసీఆర్‌..ఈ ‌కొత్త నిబంధనలతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్టాన్రికి బ్రేక్‌ ‌పడుతుందని అన్నారు. నీతి ఆయోగ్‌ అనేది నిరర్థక సంస్థగా మారిపోయిందని విమర్శించారు.

రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలు. దేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. రూపాయి విలువ పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇలాంటి ముఖ్య అంశాలపై నీతి ఆయోగ్‌లో చర్చించడం లేదు. దేశ రాజధాని దిల్లీలోనే నీళ్లు దొరకడం లేదని, ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసే దుస్థితి నెలకొందని సిఎం దుయ్యబట్టారు. నీతి ఆయోగ్‌ ‌నిష్క్రియపరంగా మారిందని అన్నారు. కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపే అంశాలపై చర్చ జరగడం లేదని, కేంద్రం నిస్తేజంగా చూస్తూ ఉండిపోతుందని మండి పడ్డారు కెసిఆర్‌. ‌దేశంలో మత సామరస్యం దెబ్బతినేలా కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, అయినా కేంద్రం ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. సమాఖ్య స్ఫూర్తిగా విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నదని, దేశంలో రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయని అన్నారు. కేంద్ర విధానాలతో దేశంలో రైతాంగం బాగా దెబ్బతిందని, సంపాదన డబుల్‌ అవ్వలేదని, రైతుల పెట్టుబడి మాత్రం డబుల్‌ అయ్యిందని అనాన్ర. దేశంలో ద్వేషం, అసహనం పెరిగిపోతున్నాయని సీఎం కేసీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య  దేశంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నీతి ఆయోగ్‌ ‌సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సిఎం స్పష్టం చేశారు. గతంలో ప్లానింగ్‌ ‌కమిషన్‌ ‌వల్ల దేశం అభివృద్ధి చెందిందన్న ఆయన…అలాంటి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ ‌తెచ్చారని అన్నారు.

ప్రస్తుతం ఆ సంస్థ నిరర్థక సంస్థగా, ప్రధాని భజన మండలిగా మారిందని కేసీఆర్‌ ‌విమర్శించారు. అప్పట్లో మంచి చెప్తే వినే ప్రధానులు ఉండేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. ఈ సందర్భంగా పంచవర్ష ప్రణాళికలు, నెహ్రూ అనుసరించిన విధానాలను ఆయన ప్రస్తావించారు. దేశంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేషాన్ని అసహనాన్ని పెంచుతున్న ఎన్డీఏ సర్కారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హావి• నెరవేర్చలేదని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఎప్పుడు లేనట్టుగా 13 నెలల పాటు రాజధానిలో ఆందోళన చేసి 800 మంది ప్రాణాలు కోల్పోతే.. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పి చట్టాలు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వొచ్చిందని అన్నారు. రైతుల పెట్టుబడి రెట్టింపు అయిందే తప్ప ఆదాయం డబుల్‌ ‌కాలేదని విమర్శించారు. తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో విద్యుత్‌ ‌సరఫరా సరిగా లేదన్న విషయాన్ని కేసీఆర్‌ ‌ప్రస్తావించారు. ఇక దేశ రాజధానిలో మంచి నీటి కటకట ఉందంటే నీతి ఆయోగ్‌ ఏం ‌చేస్తుందని కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. ఉపాధి హావి• కూలీలు సైతం జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద నిరసన చేపట్టే పరిస్థితి తలెత్తిందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఒకవైపు నిరుద్యోగం పెరిగిపోతుండగా..మరోవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతుందని ఇలాంటి పరిస్థితుల్లో నీతి ఆయోగ్‌ ఏం ‌మార్పు తెచ్చిందని నిలదీశారు. విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోతున్నాయని అన్నారు. కేంద్ర వైఖరి కారణంగా అంతర్జాతీయ విపణిలో భారత్‌ ఇజ్జత్‌ ‌పోతుందని చెప్పారు. వి•డియా సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

ఇదేనా సమాఖ్య స్ఫూర్తి..?
దేశంలో ఏకస్వామ్య పార్టీ విధానం వొస్తదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడే అన్నాడని, ఇటువంటి నిరంకుశ విధానం దేశానికి మంచిదా అని సిఎం కెసిఆర్‌ ‌ప్రశ్నించారు. ప్రశించిన రైతులను కార్లతో తొక్కించారని, రాజ్యాంగ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చేశారని మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. దేశమంతా ఏక్‌నాథ్‌ ‌శిండేలను తయారు చేస్తామని బెదిరిస్తున్నారని, ఇదేనా సమాఖ్య స్ఫూర్తి అని కెసిఆర్‌ ‌ప్రశ్నించారు.

దందాగా ఎన్‌పిఏల వ్యవహారం
కొన్ని సంస్థలకు ఎన్‌పిఏల పేరిట 12 లక్షల కోట్లు ఇచ్చారని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఎన్‌డిఏ హయాంలో ఎన్‌పిఏల వ్యవహారం దందాగా మారిందని, ఎన్‌పిఏలు 2 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్లకు పెరిగిందని, కొన్ని సంస్థలు, అధికారులు కుమ్మక్కై కమీషన్లు తీసుకుని ఎన్‌పిఏలకు దోచిపెడుతుంని ఆరోపించారు. ఎన్‌పిఏల వ్యవహారం ఓ దందాగా మారిందని కెసిఆర్‌ ‌దుయ్యబట్టారు.

Leave a Reply