Take a fresh look at your lifestyle.

నితీశ్‌ ‌చాణక్యం

“నితీశ్‌ ‌కుమార్‌ ఇప్పటికీ తన నిబద్ధత రాజకీయాలనే అనుసరిస్తున్నారా లేక ఉద్దేశ్యం పూర్వకంగానే ఆయన రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించాలనుకుంటున్నారా అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకు మూడు నిర్ణయాత్మక చర్యలను  నితీశ్‌ ‌తీసుకున్నారు.  దాంతో నితీశ్‌ ‌కుమార్‌కి రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సడలలేదనే విషయం స్పష్టం అయింది. బీజేపీ మూడు ముక్కలాటతో రెండవ స్థానంతో సరిపెట్టుకోవల్సి వొచ్చింది.”

ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పిఆర్‌, ‌కులప్రాతిపదిక గణనను – బీహార్‌లో బీజేపీని నితీశ్‌ ఎలా అణగదొక్కగలిగారు?

పౌరసత్వ సవరణ చట్టం బిల్లుకు అనుకూలంగా పార్లమెంటులో జనతాదాళ్‌ (‌యు) వోటు వేసినప్పుడు పార్టీ సీనియర్‌ ‌నాయకులు పవన్‌ ‌వర్మ, ప్రశాంత్‌ ‌కిషోర్‌లు ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్‌ ‌నాయకుడు నితీశ్‌ ‌కుమార్‌ను ప్రశ్నించినందుకు వారిని పార్టీనుంచి గెంటేశారు. అప్పట్లో ఈ సస్పెన్షన్లపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నితీశ్‌ ‌కుమార్‌ ఇప్పటికీ తన నిబద్ధత రాజకీయాలనే అనుసరిస్తున్నారా లేక ఉద్దేశ్యం పూర్వకంగానే ఆయన రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించాలనుకుంటున్నారా అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకు మూడు నిర్ణయాత్మక చర్యలను నితీశ్‌ ‌తీసుకున్నారు. దాంతో నితీశ్‌ ‌కుమార్‌కి రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సడలలేదనే విషయం స్పష్టం అయింది. బీజేపీ మూడు ముక్కలాటతో రెండవ స్థానంతో సరిపెట్టుకోవల్సి వొచ్చింది.

ఫిబ్రవరి 25వ తేదీన నితీశ్‌ ‌ప్రభుత్వం నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజెన్స్(ఎన్‌ఆర్‌సీ)కి వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాల్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదే రోజున అందరినీ ఆశ్చర్యపర్చే రీతిలో ప్రభుత్వం మరో తీర్మానాన్ని ఆమోదించింది. అదేమంటే, నేషనల్‌ ‌పాపులేషన్‌ ‌రిజిస్టర్‌(ఎన్‌పిఆర్‌) 2010 ‌ఫార్మాట్‌లో ఆమోదించింది. దీని ప్రకారం ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించడం, వివాదాస్పద క్లాజులను అందులో చేర్చకపోవడం ఈ తీర్మానంలోని ముఖ్యాంశాలు. తర్వాత ఫిబ్రవరి 27వ తేదీన బీహార్‌ అసెంబ్లీ 2021లో కులగణన జరిపించాలని నిర్ణయించింది. ఈ మూడు తీర్మానాలను ఏకగ్రీవంగానే అసెంబ్లీ ఆమోదించింది. బీజేపీ ఎన్‌పిఆర్‌ ‌దేశవ్యాప్తంగా అమలు జేయాలనీ, ఎన్‌ఆర్‌ ‌సీ విషయంలో సందిగ్ధంలో ఉండగా, ఈ తీర్మానాలను బీహార్‌లో బలపర్చింది. ఎఆర్‌సీ, ఎన్‌పిఆర్‌, ‌కులగణనలపై నితీశ్‌ ‌చెప్పదల్చుకున్నారన్నది బాగా స్పష్టంగానూ, బిగ్గరగానూ ఉంది. బీజేపీలో సీనియర్‌ ‌నాయకులు ఎవరూ ఎన్‌ఆర్‌సీ అమలు భవిష్యత్‌లో ఉండే అవకాశాన్ని ఖండించలేదు. ఈ అంశంపై ఇంతవరకూ చర్చ జరగలేదని మాత్రం వారు తెలిపారు. 2021లో కులగణనను నిర్వహిం చడంపై 2011 నాటి గణాంకాలను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది. పార్టీ ఆరేళ్ళ పాటు అధికారంలో ఉంది.

నేషనల్‌ ‌పాపులేషన్‌ ‌రిజిస్టర్‌(ఎన్‌ ‌పిఆర్‌)‌ను అమలు జరిపేందుకు బీజేపీ సిద్దంగా ఉండగా, నీతీశ్‌ ‌కుమార్‌ ‌గట్టి సందేశం ఇచ్చారు. ఏమని అంటే తాను అధికారంలో కొనసాగుతానని. బీహార్‌ ‌ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారని ఎవరైనా అనుకుంటే వారి ఊహాగానాలు చెల్లాచెదురవుతాయని అన్నారు. జేడీయులో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై తిరుగుబాటును ఆయన అణచివేశారు. ఆ తర్వాత బీహార్‌లో తదుపరి ఎన్నికలకు నితీశ్‌ ‌కుమార్‌ ‌నేతృత్వంలోనే బీజేపీ, జనతాదళ్‌ ‌యు వెళ్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ప్రకటించారు. నితీశ్‌ ‌కుమార్‌ అసెంబ్లీ చేత ఆమోదింపజేసిన తీర్మానాలు మూడు జనతాదళ్‌ ‌యు ముస్లిలు, ఒబీసీలు, దళితులను ఆకర్షించడం కోసమే. కుల గణనపై ఆర్‌జేడీ ప్రతిస్పందించింది.

కులగణన ఎందుకు సున్నితమైంది
కులగణన బీహార్‌లో చాలా కాలంగా ఉన్న డిమాండ్‌. 1931 ‌తర్వాత మళ్ళీ అటువంటి కులగణన జరగలేదు. చిరకాలంగా ఉన్న డిమాండ్‌ను ఏదో ఒక కారణంతో పక్కన పెడుతూ వొస్తున్నారు. ఈ డిమాండ్‌ ‌చేసే వారు కులతత్వం సమాజంలో ఇంకా ఉందని అంటున్నారు. అందువల్ల కులగణన చేయాల్సిందేనన్నది వారి వాదన. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో, ఇతర రంగాల్లో ప్రాధాన్యం కల్పించడానికి కులగణన జరగాల్సిందేనని వారి వాదన. రాష్ట్రంలో ఒబీసీలు ఇతర రాష్ట్రాల్లో కన్నా బిన్నమైనవారు. వారికి రాష్ట్రంలో బలం బాగా ఉంది. ఈ కులగణన కోసం గతంలో యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వం ఐదువేల కోట్లు ఖర్చు చేసినా కులగణన నివేదికలను బయటపెట్టలేదు.
– ‘ద క్వింట్‌’ ‌సౌజన్యంతో

Leave a Reply