Take a fresh look at your lifestyle.

ఈ ‌నిశీధి కరిగిపోతుంది….

ఈ నిశీధి నీడల్లోంచి లేచి తోవ కోసం
తచ్చాడుతోంటే..
మృత్యు కోరల్లోంచి దూరి దూరాలకు
పరుగులిడుతోంటే..
మళ్ళీ ఈ రంగుల విషవలయం ఏంటి?
మళ్ళీ కొత్త మరణ శాసనం ఏంటి!
ఊహాతీతమైన పంజా ఎలా దూసుకొచ్చింది
ఇది దారుణం….నరజాతిని నరనరాన
నలిపేసే నవ నవోన్మేష నరకం..
బ్లాక్‌ ‌ఫంగస్‌!
‌నల్ల నరకం!!
వీటికి తోడు వైట్‌ ‌ఫంగస్‌.. ఎల్లో ఫంగస్‌
‌గతి లేక వాడిన స్టెరాయిడ్‌ ‌మందుల
అనూహ్య మాలిన్యమిది……
తల్లి బూచికి మళ్ళీ పిల్ల బూచి!
అంతుచిక్కని పొగలా కమ్మేసి
మెలి మెల్లిగా కబళించి నల్లగా
మొహానికి మసి పూసి బతుకుని
విషాద వలయం చేసి చావు వల
వేసి చాకచక్యంగా లాక్కొని పోయే
సూక్ష్మక్రిమి మరో రౌద్రావతారం!
కరోనా కబంధ హస్తాల్లోంచి విడిపించిన
వాళ్ళని మళ్ళీ సమాధుల్లోకి లాక్కొని
పోతోంటే కనుగుడ్లు కొరికి….మెదడు చిదిమి
వికటాట్టహాసం చేస్తూ బాధితులతో పాటూ
చూపరుల్నీ వణికించేస్తుంది
అభాగ్యులారా! బాధా సర్ప దష్టులారా!
ధైర్యం వహించండి ఈ విషాదానికి, విషానికీ
విరుగుడు వచ్చింది! ఔషదాలు అందుబాటవుతున్నాయ్‌
ఇక ఈ నల్ల చీకటి తెలవారటమే తరువాయి!
మన బతుకులకు పట్టిన ఈ బూజుని ఆసాంతం
తుడిచి పారేద్దాం……….

– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253

Leave a Reply