Take a fresh look at your lifestyle.

నిశ్శబ్ద లిపి

కాలం కదిలితే మౌనం పలకదు
నిశ్శబ్దం వేరే భాషను వెతుక్కుంది
అంగీకారం అర్థాంతరంగా ఉరేసుకుంది
కొన్ని పదాలు ఊచకోత కొయ్యబడ్డాయి
విప్లవానికి విద్రోహానికి సంకుల సమరం
పెదవి కదిపితే రక్తం చిందుతుంది
మరణం బొడ్రాయి కింద మృదంగం వాయిస్తుంది
నరాలు తంత్రీ వాద్యాల్లా విజృంభిస్తున్నాయ్‌
అదుగో పులి… మూడోసారి
ఇదుగో బలి… నాల్గోసారి
గుండెను గాజుపెంకు చీల్చింది
మెదడు శిలువ వేయబడింది
సమ్మెట దెబ్బలు…
కొడవలి గాట్లు…
ఎయ్‌..!!
‌భావం అర్థం అంతా మటాష్‌
‌బరితెగించిన వాఖ్యానం
సిరంజిలోంచి రక్తంలోకి
ఎరుపెక్కుతున్న దేహం
కనుగుడ్లలోంచి తూటాలు
అరచేతిలోకి జెండాలు
మలిపితే చిరుగుతున్న పుటలు
నడుస్తున్న చరిత్ర నడిబొడ్డున పాతేయ్‌..!!

– ‌రఘు వగ్గు

Leave a Reply