- ముఖేష్ సింగ్‌కు క్షమాభిక్ష తిరస్కరణ
- తాజాగా డెత్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతకు కొత్త తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశిస్తూ దిల్లీ కోర్టు తాజాగా మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటి వరకు 22న ఉదయం 7గంటలకు ఉరితీతకు సంబంధించి డెత్ వారెంట్ ఉంది. అయితే ఈ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో తాజా డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ తిహార్ జైలు అధికారులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారని, అందువల్ల దోషుల ఉరితీతకు కొత్త తేదీ, సమయం చెబుతూ డెత్ వారెంట్ జారీ చేయాలని తిహాడ్ అధికారుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరారు. యితే క్షమాభిక్ష పిటిషన్ కొట్టివేత గురించి దోషి ముఖేశ్‌కు సమాచారమిచ్చేందుకు కోర్టు జైలు అధికారులకు సాయంత్రం 4.30 గంటల వరకు సమయమిచ్చింది. దీంతో అధికారులు ముఖేశ్‌కు అధికారికంగా సమాచారమిచ్చారు. అనంతరం ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో మరో దోషి అయిన పవన్ గుప్తా మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఘటన సమయంలో తాను జువైనల్ అని, దాని ఆధారంగానే విచారణ జరపాలని అభ్యర్థించాడు.
నిర్భయ దోషి ముఖేష్ సింగ్‌కు క్షమాభిక్ష తిరస్కరణ
నిర్భయ కేసులో దోషి ముఖేష్‌సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష అర్జీని ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ •ంశాఖకు పంపిచారు. •ంశాఖ వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపింది. ముఖేష్‌సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్ తిరస్కరించినట్లు కేంద్ర •ంశాఖ వర్గాలు వెల్లడించాయి. ముఖేష్ సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈ నెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్ జైలు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో నిందితులు కావాలనే తమ ఉరిని వాయిదా వేసేందుకు క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్ల పేరుతో నాటకాలాడుతున్నారని నిర్భయ తల్లిదండ్రులు, పలువురు అధికారులు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖేశ్ క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించాలని ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ కేంద్రానికి సిఫారసు చేశారు.
Tags: Nirbhaya Convicts, Hang,February 1, live hanging