Take a fresh look at your lifestyle.

ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ పునర్నియామకం

అర్ధరాత్రి ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం

అమరావతి,జూలై 31 : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను మరోసారి నియమిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి నియమిస్తున్నట్లు వెల్లడిం చింది. ఈ మేరకు గవర్నర్‌ ‌పేరిట పంచాయతీరాజ్‌ ‌శాఖ ముఖ్య కార్యదర్శి నోటిఫికేషన్‌ ‌జారీ చేశారు. సుప్రీంలో దాఖలు చేసిన స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌ ‌తుది తీర్పునకు లోబడి నోటిఫికేషన్‌  ఉం‌టుందని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎస్‌ఈసీగా ఉన్న సమయంలో కోవిడ్‌ 19 ‌వ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చి ఆయనను పదవి నుంచి తొలగించారు.
దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ ‌కుమార్‌ ‌తిరిగి నియమకం హర్షణీయమని లాయర్‌ ‌నర్రా శ్రీనివాస్‌ ‌పేర్కొన్నారు. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. హైకోర్టు తీర్పును సవాల్‌ ‌చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళిందన్నారు. సుప్రీంకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైందన్నారు. తప్పనిసరి పరిస్థితులలో ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ కేసులో వెనక్కు తగ్గిందని నర్రా శ్రీనివాస్‌ ‌పేర్కొన్నారు.ఈ పని ముందే చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేదన్నారు.కోర్టు ఆదేశాలు అమలు చేయాలని మరల కోర్టులే కలుగు జేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిం దన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్‌లో పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.న్యాయస్థానాలను, న్యాయ తీర్పులను గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని నర్రా శ్రీనివాస్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply

error: Content is protected !!