జెండా మొసిన భుజాలు
మది మరిచిన ఇజాలు
ఉద్యమంలో కదం తొక్కినకాళ్ళు
జై తెలంగాణ నినాదమైన నోళ్ళు
బిగుసుకున్న పిడికిళ్ళు
కేసులకు వెరవని వాళ్ళు
రైలు పట్టాలపై పడుకున్నోళ్ళు
లాఠీ దెబ్బలకు వోర్చుకున్న ఒళ్ళు
ఈనాడు సర్కారుకు కాని వాళ్ళు
పచ్చి ప్రజాద్రోహులు అయనవాళ్ళు
నాటి ఉద్యమనేతగా వీరాభిమానులు
నేటి పాలకుడికి ఏవీ గౌరవాభిమానాలు
వారసత్వ పాలనకు తపిస్తాండు
సుబ్బుండుల ముందు చులకనైండు
జనాల్లో స్థిరపడుతున్న వ్యతిరేకత!!
కనుమరుగవుతున్న అనుకూలత!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్టు, ప్రజాతంత్ర