Take a fresh look at your lifestyle.

కలెక్టరేట్లో నిల్‌.. ‌మున్సిపల్‌లో ఫుల్‌

‌దుబారాను తగ్గించి మిగిల్చిన అధాయంతో పట్టణ ప్రజల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన మున్సిపల్‌ ‌పాలకులు పనిలేకున్నా ఓ ఎనిమిది మంది కంపూటర్‌ అపరేటర్లకు వేతనాలు ఇస్తు ప్రజల సొమ్మును దుబారా చేస్తున్న సంఘటన జగిత్యాల మున్సిపల్‌లో చోటుచేసుకొంది. జగిత్యాల మున్సిపల్‌లో కమీషనర్‌ అఫ్‌ ‌మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ‌నుంచి వచ్చిన రెగ్యులర్‌ ఉద్యోగులలో ఓ సిస్టమ్‌ ‌మేనేజర్‌తోపాటు ఇద్దరు సిస్టమ్‌ అసిస్టెంట్లు ఉండగా గత పాలకుల ఓ ఎనిమిది మంది కంప్యూటర్‌ అపరేటర్లను ఔట్‌సోర్సింగ్‌ ‌పద్దతిలో నియమించుకొన్నారు. ఆనాడే ఇందులోని కొందరు అనుకూలమైన వ్యక్తులు 20 వేలకు పైగా నిబందలను ఖాతరు చేయకుండా వేతనాలు ఇచ్చేశారు. అడిట్‌ అధికారులు అభ్యంతరాలతో వేతనాలు స్థిరికరించినా వీరందరికి కార్యాలయంలో పనేలేకున్నా కొనసాగిస్తున్నారనే అరోపణలున్నా యి. జగిత్యాల జిల్లా ఎర్పడినపుడే కలెక్టరేటు కార్యాలయంలో ఐదుగురు కంప్యూటర్‌ అపరేటర్ల ను తాత్కాలిక పద్దతిలో నియమించుకొన్నా వేతనాలు రావడలేదని తొలగించగా ఇతర విభాగాల్లోని కంపూటర్‌ ‌పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో కార్యాలయ పనులను నెట్టుకొస్తున్నారు. కాని జగిత్యాల మున్సిపల్‌లో గత కొన్నేండ్లుగా ఆపరేటర్ల రూపంలో దుబారా జరుగుతున్నా ఏనాడు పాలకులు దిశగా అలోచించకపోవడంతో మున్సిపల్‌ అధాయం వృధాగా పోతోంది. ఎప్రిల్‌ 1,2020‌న కొత్త వేతనాలు ఈ కంప్యూటర్‌ అపరేటర్లకు స్థిరికరించగా ఓక్కోక్కరికి 17 వేల 5 వందలుగా నిర్ణయించారు.

ఇందులోని అపరేటర్లకు పనిలేకపోగా వృదాగా వేతనాలు ఇస్తున్నా ఇతర పనులకైనా వినియోగించుకోలేక పోతున్నారనే అరోపణలున్నాయి. రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మీసేవ ద్వారా సెల్ఫ్ అసెస్‌మెంట్‌ ‌చేసి ఇంటిపన్నును నిర్దారించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై సరైన ఆవగాహన లేని పట్టణ ప్రజలను ఇక్కడి కంప్యూటర్‌ అపరేటర్లు మరోదారితో దోచేస్తున్నారు. కొత్త ఇంటి నిర్మాణానికి నెంబర్‌ ‌వేయడానికి మున్సిపల్‌లోని రెవెన్యూ విభాగంపై అవగాహన కల్గిని కొందరు సిబ్బంది వెళ్ళి ఇంటి కొలతలను కొలిచి మామూళ్ల రూపంలో రెండు నుంచి ఐదు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు బాదిత ఇంటి యజ మానులే అంటున్నారు. వీటన్నింటికి తోడు గత పాలకులు తమకు అనుకూలమైన వ్యక్తులను మున్సిపల్‌లో ఔట్‌సోర్సింగ్‌ ‌పద్దతిలో కంప్యూటర్‌ అపరేటర్లుగా నియమించుకొగా నిబందనల ప్రకారం వీరందరికి డిసిఏ వంటి సర్టిఫికెట్‌ ఉం‌డాల్సి ఉన్నా ఎలాంటి నిబందనలను పాటించకుండా సర్థిఫికెట్స్ ‌లేకున్నా నియామకాలు జరిపినట్లు సమాచా రం. ప్రతి ఏటా బడ్జెట్‌లో ఖర్చు అధాయాన్ని సమానంగా చూపెడు తున్న పురపాలకులు, అధికారులు మున్సిపల్‌లోనే పెరిగిపోతున్న దుబారాను నివారించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రజాధనం వృదాకాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy