Take a fresh look at your lifestyle.

కొరోనా వార్తలతో రాత్రిళ్ళు కలవరం

కలవరపెడుతున్న కొరోనా సోమ్నియా

గత 24 గంటల్లో మన దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3.43 లక్షలు కొరోనా దేశ ప్రజలను రోజురోజుకూ ఆందోళనకు గురిచేస్తూ ఉన్నది. నిన్నమొన్నటి వరకు కలిసి మాట్లాడిన వారూ, కలిసి తిరిగిన వారూ పిట్టల్లా రాలిపోతుంటే కళ్ళముందు ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. లక్షణాలు లేకుండానే విజృంభిస్తున్న కొరోనా మహమ్మారి పట్టణంలోనే కాకుండా పల్లెలకు కూడా పాకి జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నది. ప్రపంచాన్ని తన పంజాదెబ్బతో కొరోనా మహమ్మారి ప్రజలను చంపేస్తూ ఉంటే సామాన్య ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. రోజురోజు పెరుగుతున్న మరణాలను చూసి ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. అదే పనిగా ఆ జ్ఞాపకాలను మరిచిపోలేక మధనపడుతూ రాత్రిళ్ళు నిద్రలో కూడా కలవరింపులతో బెంబేలెత్తిస్తున్న సంఘటనలతో ఇంటిల్లిపాది భయ బ్రాంతులకు లోనవుతున్నారు. కొరోనా సమయం లో మనుషుల మానసిక స్థితిని అంచనా వేయడానికి కలలను అధ్యయనం చేయడానికి మ్యూజియం ఆఫ్‌ ‌లండన్‌ ‌తన కసరత్తును ముమ్మరం చేసింది.

కలవరపెడుతున్న కొరోనా సోమ్నియా:

కొరోనా.. కొరోనా.. కొరోనా.. కొరోనా.. నిద్దట్లోనూ ఇదే కలవరింపు. కొరోనా మహమ్మారి ఒత్తిడి, ఆందోళనలతో నిద్ర సరిగా పట్టకపోతే కొరోనా సోమ్నియాతో బాధ పడుతున్నారన్నట్లే. ప్రజల అందరి జీవితాలను కొరోనా కలవరపెడుతోంది. ఇల్లు దాటి బయటి ప్రపంచాన్ని చూడలేము, స్నేహితులను, బంధువులను కలవలేని పరిస్తితి. నచ్చిన చోటుకు వెళ్లలేము. ఎంజాయ్‌ ‌చేసే పరిస్థితి అంతకన్నాలేదు. దీనికి తోడూ మన స్నేహితులు, బంధువులు కొరోనా బారిన పడినట్లుగా తెలిస్తేనే భయంతో అతిగా ఊహించుకుంటూ ఉండడంతో మనిషిని కలల రూపంలో వెంటాడుతున్నాయి. అని అంటే నమ్మలేరోమో కానీ ఇదీ నిజం. అని లండన్‌ ‌లో కలలపై జరిగిన పరిశోధనాలే తార్కాణం. చాలా మందిలో కొరోనా గాలి వార్తలతో కలిగిన ఆందోళనలతో కలల రూపం లో వెంటాడుతూ రాత్రి పూట కూడా కొరోనా ప్రజలను వదిలి పెట్టడం లేదు. కొరోనా మహమ్మారి వైరస్‌ ‌వ్యాప్తి ద్వారా కలిగిన మానసిక ఆందోళన, కోవిడ్‌-19 ‌పైన ఉన్న అపోహలు, రోజు రోజుకో ఊహాగానాలతో వస్తున్న సోషల్‌ ‌మీడియా వార్తలు మనిషి నిద్రలో ఉన్నపుడు పీడ కలలు గా వస్తూ ఉంటాయి. మనిషిలో ఆందోళన పెరిగిన కొద్దీ నెగెటివ్‌ ‌కలలు పెరిగి పోతాయి.

కలలు మానసిక స్తితిని సూచిస్తాయా:

కొరోనా మహమ్మారి తో సామాన్య ప్రజల అవస్థలు అతీగతీ లేని సందంగా తయారయ్యింది. ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులతో నానా కష్టాలు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇల్లు దాటి బయటకు వెళ్లలేని పరిస్తితి, భవిష్యత్తుపై ఆందోళనలతో మానసికంగా క్రుంగి కుశించిపోతున్నారు. కొరోనా వార్తలతో, కొరోనా సంఘటనలతో, కొరోనా చిత్రాలతో, కొరోనా కొరోనా కొరోనా మాటలతో ఉదయం అంతా గడుపుతూ ఉన్న ప్రజలపై రాత్రి పూట కూడా కొరోనా తన ప్రభావాన్ని కొరోనా కలలతో మానసికంగా మనిషిని బలహీనున్ని చేసెస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. కొరోనా సంక్షోభంలో ప్రజలకు వచ్చిన కలలు వారి మానసిక స్థితి అద్దం పడుతుంది అని లండన్‌ ‌మ్యూజియం నిర్వాహకులు తమ పరిశోధనలతో తెలియచేస్తూ ఉన్నారు.

కొరోనా కలవరమే:

అసలే కొరోనా భయం.. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కొరోనా కలవరమే కనిపిస్తోంది. ఏది ముట్టుకోవాలన్నా ఆలోచిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కొరోనాకు సంబంధించి విషయాలే చుట్టూ తిరుగుతుంటాయి. కొరోనా గురించి తప్ప మరో విషయం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో కొరోనా ప్రభావంపై మనుషులపై ఎంతగా చూపిస్తోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇళ్లలోనే ఉన్నప్పటికీ కొరోనా భయం వదలడంలేదు. ఆఖరికి నిద్రలోనూ కొరోనా వెంటాడుతూనే ఉంది. కొరోనా ఆందోళనతో సరిగా నిద్రపట్టక మధ్యలోనే మెలకువ వచ్చేసి అటు ఇటూ తిరిగేయడం, ఏవేవో కలలు తనను వెంటాడుతున్నట్లు భ్రమలతో బ్రతుకును వెళ్లదీస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.

పీడ కలలకు చెక్‌ ‌పెట్టండిలా :
గాఢనిద్రతో కలలకు చెక్‌: ‌రోజుకీ హాయిగా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. గాఢ నిద్ర కోసం కాసేపు ఉదయం ఎండలో ఉండాలి. డి విటమిన్‌ ‌తో పాటు గా రోజంతా చలాకిగా ఉంటారు. అంతే కాకుండా రాత్రి పూట నిద్ర బాగా పడుతుంది. కాఫీ, టీలు కూడా తాగడం తగ్గించాలి. రాత్రి ఆహారంలో త్వరగా జీర్ణమయ్యే పధార్థాలు తీసుకోవడం మంచిది. నిద్రపోయే కంటే 30 నిమిషాల ముందు పాలు లేదా మజ్జిగ తాగితే నిద్ర బాగా పడుతుంది. కొరోనా కష్టకాలంలో ఇళ్ళల్లోనే ఉంటూనే ఎలాంటి ఆందోళనలు భయాలు పెట్టుకోకుండా కంటి నిండా హాయి గా నిద్రపోవాలి.

అవసరమైన వార్తలు మాత్రమే చదవండి: కొరోనా వైరస్‌కు సంబంధించి మానసికంగా ఇబ్బంది పెట్టే వార్తలని చదవడం కానీ, చూడటం కానీ తగ్గించండి. ఒక నిర్దిష్ట సమయం కేటాయించుకుని మాత్రమే వార్తలు చదవండి. కొరోనా వైరస్‌ ‌గురించి చాలా తప్పుడు సమాచారం ప్రచారమవుతోంది. ప్రభుత్వ సమాచార సాధనాలు, జాతీయ ఆరోగ్య నిపుణులు ద్వారా వచ్చే సమాచారం పై మాత్రమే దృష్టి పెట్టండి.

సోషల్‌ ‌మీడియా నుంచి బ్రేక్‌ ‌తీసుకోండి:

సోషల్‌ ‌మీడియా వలన కూడా మానసిక ఆందోళన పెరిగిపోతుంది, సోషల్‌ ‌మీడియాలో పోస్టింగ్‌ అవుతున్న తప్పుడు వార్తలను చూస్తూ భయాందోళనలకు గురవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆందోళనకి గురి చేసే సమాచారానికి దూరంగా ఉండడమే మంచిది. సోషల్‌ ‌మీడియా నుంచి దూరంగా ఉంటూ, పుస్తకాలు చదవటంలో గడుపడానికి ఎక్కువ సమయం కేటాయించుకోవాలి.

ఊహలు అన్నీ నిజం కావాలని లేదు:

కేవలం ఆందోళనే మాత్రమే భయపెడుతోందని తెలుసుకోవాలి. అది కేవలం మీ ఆలోచన మాత్రమే. మీరు అనుకున్నవన్నీ నిజమవుతాయని ఊహించుకోవద్దు . మీ ఆలోచనలు అన్నీనిజాలు కావని గ్రహింఛాలి. నెగెటివ్‌ ఆలోచనలని వదిలేయండి. పాజిటివ్‌ ఆలోచనలను పెంచుకోవాలి. ఇస్టమైన పనిని చేసుకునే ప్రయత్నం చేయండి.

Atla
డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

 

Leave a Reply