Take a fresh look at your lifestyle.

తెలంగాణలో మరో వారంపాటు నైట్‌ ‌కర్ఫ్యూ

  • పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  • ప్రభుత్వ తీరుపై మరోమారు హైకోర్టు అసహనం

‌తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.కొరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ ఉదయం కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ నేటితో ముగియనుండటంతో ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొరోనా విజృంభణ స్థిరంగా కొనసాగుతుండటంతో మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం యోచించింది. యథాతథంగా రాత్రి 9 గంటల నుంచి 5 ఉదయం గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

కోవిడ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌కారణంగా రాష్ట్రంలో మొదట ఏప్రిల్‌ 30 ‌వరకు కర్ఫ్యూ విధించారు. అయితే రాష్ట్రంలో కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు తగ్గుముఖం పట్టకపోవడం, దేశవ్యాప్తంగా పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో కర్ఫ్యూని పొడిగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. శుక్రవారం ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మరో వారం పాటు కర్ఫ్యూని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే 1వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు కర్ఫ్యూని పొడిగిస్తూ జీవో జారీ చేశారు. ఈ కర్ఫ్యూ అమలు కోసం జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలను కట్టబెట్టారు.ఇదిలావుంటే తెలంగాణలో కొరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది.

ఇప్పటికే కర్ఫ్యూ నేటితో ముగుస్తున్నందున తదుపరి తీసుకోబోతున్న చర్యలపై హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే నేడు వెల్లడిస్తామని ఏజీ కోర్టుకు తెలపడంతో విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయింది. వేసింది. అయితే నేడు కూడా తమ నిర్ణయాన్ని ప్రభుత్వం కోర్టుకు చెప్పకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది.

నేటితో నైట్‌ ‌కర్ఫ్యూ ముగుస్తోంది.. తదుపరి చర్యలేంటని నిలదీసింది. 24 గంటల సమయంలో కూడా ఇంకా ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ చీఫ్‌ ‌సెక్రెటరీ రివ్యూ వి•టింగ్‌ ‌నిర్వహిస్తున్నారని కోర్టుకు ఏజీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అభిప్రాయం చెప్పేందుకు హైకోర్టు 45 నిమిషాల సమయం ఇచ్చింది. ఈ సమయంలోనే చెప్పకుంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని కోర్టు వెల్లడించింది.

Leave a Reply