Take a fresh look at your lifestyle.

ఎపిలో నేటి నుంచి నైట్‌ ‌కర్ఫ్యూ

  • రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు అమలు
  •   18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌
  •   ఉన్నతస్థాయి సవి•క్షలో చర్చించిన సీఎం జగన్‌
  •   ‌వివరాలు వెల్లడించిన మంత్రి ఆళ్లనాని

కరోనా కట్టడికి ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలాగే నైట్‌ ‌కర్ఫ్యూ అమలు చేయాలని కూడా నిర్ణియంచారు. రాత్రి 10నుంచి ఉదయం 5 వరకు దీనిని అమలు చేస్తారు. ఇకపోతే  మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సిఎం జగన్‌ ‌మంత్రులతో కరోనా కట్టడిపై సవి•క్షించారు. అనేక అంశాలను చర్చించి పలు నిర్ణయాలను ప్రకటించారు.  రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీరందరికి ఏపీ సర్కార్‌ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనుంది.  ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. కరోనా కట్టడిపై సీఎం వైఎస్‌ ‌జగన్‌ అధ్యక్షతన విస్తృతంగా చర్చించా మన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పాటు వాక్సినేషన్‌ ‌ముఖ్యమని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నాం. 18-45 వయసు ఉన్న వారికి ఉచితంగా టీకా వేస్తాం. ఇందుకు గాను 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం. అలానే కరోనా కట్టడి కోసం నేటి నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ ‌కర్ఫ్యూ అమల్లోకి రానుందని మంత్రి తెలిపారు. సీటీ స్కాన్‌ ‌పేరువి•ద దోపిడీ చేయడంపై ముఖ్యమంత్రి సీరియస్‌ అయ్యారు.

దీనికి 2,500 రూపాయల ధర నిర్ణయించాం. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం. ఇది నిరంతరం జరుగుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దోపిడీకి పాల్పడవద్దని వినతి. మాస్క్, ‌భౌతిక దూరం వంటి కోవిడ్‌ ‌నియమాల అమలులో ప్రజలను భాగస్వామ్యం చేయమని సీఎం జగన్‌ ‌సూచించారు. కళ్యాణ మండపాలను కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లుగా మార్చాలని సీఎం ఆదేశించారు. బెడ్స్, ‌కోవిడ్‌ ‌రిక్రూట్మెంట్‌ ‌కూడా పెంచుతున్నాం. జిల్లా స్థాయిలో 104 కాల్‌ ‌సెంటర్లకు జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌స్థాయి అధికారిని నియమించాలని కోరామని మంత్రి తెలిపారు.  ఉచిత వ్యాక్సిన్‌ ‌కోసం రూ.1600 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి ఆళ్లనాని తెలిపారు. వైద్య పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కరోనా కట్టడిపై సీఎం జగన్‌ ‌విస్తృతంగా చర్చించారని ఆళ్లనాని తెలిపారు. వ్యాక్సిన్‌ను ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆళ్లనాని అన్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ ‌పెంచాలని సీఎం ఆదేశించారని, సిటీ స్కాన్‌కు ధరలు నిర్ణయించాలని సీఎం ఆదేశించారని ఆళ్లనాని చెప్పారు. టెన్త్, ఇం‌టర్‌ ‌పరీక్షల రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఆళ్లనాని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌విజృంభిస్తోంది.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ ‌మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై సవి•క్షిస్తున్నారు. కోవిడ్‌ ‌వ్యాక్సిన్లు, రెమిడెసివిర్‌ ఇం‌జక్షన్లకు కొరత నుంచి బయటపడటానికి కార్యాచరణ చేపట్టారు. అంతేగాక సమావేశంలో ఉంగానే భారత్‌ ‌బయోటెక్‌ ఎం‌డీ కృష్ణా ఎల్లా, హెటెరో డ్రగ్స్ ఎం‌డీ పార్థసారథికి సీఎం ఫోన్‌ ‌చేశారు. ఇరువురితో ఫోన్‌లో మాట్లాడిన వైఎస్‌ ‌జగన్‌… ‌రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్‌ ‌వాక్సిన్‌ ‌డోస్‌లతో పాటు, రెమిడెసివిర్‌ ఇం‌జక్షన్లు సరఫరా చేయాలని కోరారు.  రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గురువారం మంత్రుల కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ వివరాలను సీఎం జగన్‌కు మంత్రులు తెలియచేశారు. ఆక్సిజన్‌ ‌సప్లై, రెమిడిసివేర్‌, ‌బెడ్స్ అం‌దుబాటు తదితర అంశాలపై సీఎం జగన్‌ ‌సవి•క్ష నిర్వహించారు. మరో వైపు రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు రోజువారీగా వేలల్లోనే నమోదవుతున్నాయి. గురువారం ఏపీలో 10 వేలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి.

Leave a Reply