Take a fresh look at your lifestyle.

పోతిరెడ్డిపాడుకు ఎన్జీటీ బ్రేక్‌

  • 203 ‌జీవోపై నేషనల్‌ ‌గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌ ‌స్టే
  • నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు
  • పోతిరెడ్డిపాడుపై కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశాం: ఎంపీ రేవంత్‌

సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటరీ కెపాసిటీ పెంపునకు బ్రేక్‌ ‌పడింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోపై నేషనల్‌ ‌గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) స్టే విధించింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నిపుణుల కమిటీ వేయాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కాలుష్య నివారణ బోర్డు సభ్యుడు, కృష్ణానదీ జలాల నిర్వహణ బోర్డు సీనియర్‌ ‌సభ్యుడు, హైదరాబాద్‌ ఐఐటీ నుంచి ఒకరు సభ్యులుగా ఉన్నారు. రెండు నెలల్లో నివేదిక అందజేయాలని కమిటీని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించవద్దని ఏపీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కృష్ణానదిలో నీటి వినియోగం రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది…ఇప్పటికే ఏపీ 203 జీవో పై రెండు రాష్ట్రాల్లో రాజకీయ దూమరం రేపుతుంది.. ఇరు రాష్టాల్ర అధికారు, రాజకీయ పార్టీల నేతల కృష్ణా రివర్‌ ‌బోర్డ్ ‌కు వేరువేరుగా వినతి పత్రాలు సమర్పించారు.

 పోతిరెడ్డిపాడుపై కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశాం: రేవంత్‌
‌హైదరాబాద్‌,‌మే20(ఆర్‌ఎన్‌ఎ):   ‌పోతిరెడ్డిపాడుపై కేఆర్‌ఎం‌బీకి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్‌ ‌నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏపీకి కేటాయించిన నీటినే తీసుకెళ్తామని సీఎం జగన్‌ అం‌టున్నాడని, సీఎం కేసీఆర్‌ ‌దీన్ని సమర్థిస్తున్నారని, దీని వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకెళ్తే శ్రీశైలానికి చుక్కనీరు రాదని, శ్రీశైలం, సాగర్‌, ‌పులిచింతల విద్యుత్‌ ‌ప్రాజెక్టులను చంపేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కషన్లకు కక్కుర్తి పడి కొత్త విద్యుత్‌ ‌ప్రాజెక్టుల కోసం ప్లాన్‌ ‌చేస్తున్నారని, అందుకే నీటి తరలింపును కేసీఆర్‌ ‌సమర్థిస్తున్నారని మండిపడ్డారు. జూన్‌ 2‌న అన్ని ప్రాజెక్టుల వద్ద నిరసన తెలుపుతామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పై పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ ‌సర్కార్‌లో మాటలు తప్ప చేతలు లేవు, కరోనా నిర్మూలనలో కేసీఆర్‌ ఐసీఎంఆర్‌ ‌ప్రశంసించిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టెస్ట్‌ల సంఖ్య తక్కువగా ఉందని, కేసీఆర్‌ ‌తన ప్రభుత్వాన్ని మోనోపాలిజంతో నడుపుతున్నారని గూడూరు నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy