జనగామ: పత్రికలు ప్రజల పక్షాన నిలిచి, ప్రజల సమస్యలు పరిష్కరించే దిశలో పనిచేసినపుడే ప్రజల మన్ననలు పొందగలుగుతాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 2020 సంవత్సర ‘ప్రజాతంత్ర’ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజాతంత్ర ప్రముఖ పాత్ర పోషించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజాతంత్ర పత్రిక ప్రజల పక్షాన నిలిచిందని కొనియాడారు. క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రజాతంత్ర ప్రతినిధి ఇర్రి మల్లారెడ్డి, తరిగొప్పుల ఎంపీపీ జొన్నగోరి హరిత సుదర్శన్, నాయకులు పసుల ఏబేల్, గజ్జెల నర్సిరెడ్డి, వెన్నం సత్యనిరంజన్రెడ్డి, పెద్ది రాజిరెడ్డి, చిర్ర హన్మంతరెడ్డి, మామిడాల రాజు, తదితరులున్నారు.
Tags: Newspapers, stand on behalf, public , janagama MLA, Muttireddy Yadagiri Reddy