మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, జనవరి 23 : ప్రజలకు ప్రభుత్వానికి వారధిగాప్రతికలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిపి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అదివారం మంత్రి నివాసంలో ప్రజాతంత్రదిన పత్రిక నూతన సంవత్సరం సందర్భాంగా క్యాలెండర్ మంత్రి ఆవిష్కరించారు.ఈ సందర్భాంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పత్రికలు ప్రజాస్వామానికిమూలస్తంబాలు ఉన్నాయని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంలో పత్రికల పాత్ర ఎంతో ఉందన్నారు.
ప్రజాతంత్ర దిన పత్రిక 25 సంవత్సరాల పూర్తి అయినసందర్భాంగా పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోతర్ల అంబయ్య యాదవ్, శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ దోమ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మాజీ వక్స్బోర్డు చైర్మన్ ఎం ఎ సమీర్, మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అదిల్ అల్లి, సహకారసోసైటీ డైరెక్టర్ కడమోని ప్రభాకర్, నాయకులు టీ లక్ష్మయ్య, కటికెల మైసయ్య, పి. చందు తో పాటు తదితరులు పాల్గోన్నారు.