దేశంలో కొరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత కొన్నిరోజులుగా ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతుండగా, తాజాగా లక్ష కేసులకు రెండడుగుల దూరంలో నిలిచాయి. దీంతో దేశంలో 44 లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 95,735 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 44,65,864కు చేరాయి.
ఇందులో 9,19,018 యాక్టివ్ కేసులు ఉండగా, 34,71,784 మంది బాధితులు కోలుకున్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1172 మంది మరణించారు. ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో కొరోనా బాధితులు మరణించడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 75,062కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బుధవారం ఒకేరోజు 11,29,756 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 9 నాటికి దేశవ్యాప్తంగా 5,29,34, 433 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.