తెలంగాణలో కొరోనా కేసుల సంఖ్య పెరుగులూనే ఉంది. బుధవారం రాత్రి వరకు 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,159 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003గా ఉంది. ఇందులో 1,33,555 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కొరోనాతో 24 గంటల్లో కొత్తగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1005కి చేరింది. రికవరీ రేటు 80.94 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా కొత్తగా 97,894 మందికి పాజిటివ్
దేశవ్యాప్తంగా కూడా కొరోనా వైరస్ విజృంభిస్తూనే ఉన్నది. 24 గంటల్లో దేశంలో కొత్తగా 97,894 మందికి కొరోనా సోకింది. దీంతో దేశవ్యాప్తంగా వైరస్ కేసుల సంఖ్య 51,18,254కు చేరింది. 24 గంటల్లో కొరోనా వల్ల 1,132 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 83,198కి చేరుకున్నది. కేసుల పరంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నది.