Take a fresh look at your lifestyle.

కొత్తగా 6,542 మందికి పాజిటివ్‌..20 ‌మంది మృతి

  • రాష్ట్రంలో విజృంభిస్తున్న కొరోనా సెకండ్‌ ‌వేవ్‌
  • ‌టెస్టుల కోసం క్యూ కడుతున్న ప్రజలు
  • గాంధీలో ఆందోళన కలిగిస్తున్న మరణాల సంఖ్య

రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌విజృంభిస్తున్నది. భారీగా పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి కర్ఫ్యూ విధించారు. రోజు రోజుకు పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి వరకు గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్‌ ‌కేసులు నమోదవగా..20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ ‌బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్‌ ‌కేసులున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో మంగళవారం ఒకే రోజు 1,30,105 పరీక్షలు చేయగా.. 6,542 మందికి పాజిటివ్‌ ‌వొచ్చిందని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎం‌సీలో 898, మేడ్చల్‌లో 570, రంగారెడ్డిలో 532, నిజామాబాద్‌లో 427, సంగారెడ్డిలో 320, నల్గొండలో 285, మహబూబ్‌నగర్‌లో 263, వరంగల్‌ అర్బన్‌ 244, ‌జగిత్యాలలో 230, ఖమ్మం జిల్లాలో 246 మంది మహమ్మారి బారినపడ్డారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 3,67,901కి చేరగా.. ఇప్పటి వరకు 3,19,537 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌బారినపడి మొత్తం 1,876 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే గాంధీ హాస్పిటల్‌లో కొరోనా మరణాలు కలవర పెడుతున్నాయి. హాస్పిటల్‌లో 3 రోజుల్లో 220కి పైగా మరణాలుచోటుచేసుకున్నట్లు సమాచారం.

అయితే అధికారికంగా హాస్పిటల్‌ ‌వర్గాలు వెల్లడించలేదు. మృతదేహాలతో గాంధీ కరోనా మార్చురీ నిండిపోయింది. జనరల్‌ ‌మార్చురీ బిల్డింగ్‌ను కూడా కొరోనా మార్చురీగా మార్చారు. గాంధీలో నాన్‌ ‌కొవిడ్‌ ‌మృతదేహాల పోస్టుమార్టం నిలిచిపోయినట్లు తెలిసింది. పోస్టుమార్టం కోసం ఉస్మానియాకి గాంధీ సిబ్బంది రిఫర్‌ ‌చేస్తున్నారు. మరోవైపు నగరంలోని వనస్థలిపురంలో అనుమానితులు కరోనా టెస్ట్ ‌చేయించుకోవడానికి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి వొచ్చారు. శ్రీరామనవమి సెలవు రోజు కావడంతో ప్రభుత్వ హాస్పిటల్‌ ‌రద్దీగా మారింది. దీంతో హాస్పిటల్‌ ఆవరణలో వ్యాక్సిన్‌ ‌లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలో నిలబడి ప్రజలు నిరాశతో తిరిగి ఇంటి బాట పట్టారు. రాష్ట్రంలో వైరస్‌ ‌విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలోని చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. మే 15 వరకు చార్మినార్‌, ‌గోల్కొండ సందర్శనాలు రద్దు చేస్తూ  పురావస్తుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్‌ ‌నేపథ్యంలో చార్మినార్‌ ‌మార్కెట్‌కు రాత్రి 8 గంటల వరకే అనుమతినిచ్చారు. కుతుబ్‌షాహీ టూంబ్స్, ‌సాలార్జంగ్‌ ‌మ్యూజియం సహా ఇతర పర్యాటక ప్రాంతాల మూసివేతపై ఇంకా ప్రకటన రాలేదు.

Leave a Reply