Take a fresh look at your lifestyle.

కొత్తగా 210 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు

కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో కొరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే శుక్రవారం రోజు ఏపీలో కొత్తగా 210 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.

కొరోనా వల్ల ఈ రోజు ఒకరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 8,91,388 కొరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్‌-19 ‌వల్ల ఇప్పటి వరకు మొత్తం 7,180 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం 1,227 మందికి కొరోనా చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. కొరోనా నుంచి 8,82,981 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు.

Leave a Reply