కట్టడికి ఢిల్లీ తరహా చర్యలు తీసుకోవాలి : కేంద్ర బృందం సూచన
తెలంగాణలో కొరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో రికవరీ కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1,896 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం 8 గం.ల వరకు 24 గంటల్లో కొరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 82,647కు చేరుకోగా…645 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 22,628 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే వైరస్ నుంచి కోలుకుని 59,374 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,42,875 టెస్టులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 338 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే రంగారెడ్డి 147, కరీంనగర్ 121, మేడ్చల్ 119, వరంగల్ అర్బన్ 95, గద్వాల్ 85, జనగామ 71, కామారెడ్డి 71, పెద్దపల్లి 66 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా వుంటే కొరోనా కట్టడి ప్రాంతాల నిర్వహణ విషయంలో ఢిల్లీ తరహా చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్ర బృందం రాష్ట్రానికి సూచించింది.
అక్కడ తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నీతి ఆయోగ్ సభ్యుడు డా.వినోద్‌కుమార్ పాల్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజ, డాక్టర్ రవీంద్రన్‌లతో కూడిన బృందం రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పలు అంశాలపై చర్చించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, జీహెచ్ఎంసీ అధికారులతో కేంద్ర బృందం చర్చించింది. ఈ సందర్భంగా కోవిడ్ కట్టడి ప్రాంతాల్లో ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని సూచించింది. •ం ఐసొలేషన్‌లో ఉంటున్న కొవిడ్ రోగుల కోసం ‘హితం’ యాప్‌ను ప్రవేశపెట్టి టెలీ మెడిసిన్ పద్ధతిన ఔషధాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుండటాన్ని కేంద్ర బృందం ప్రశంసించింది. రాష్ట్రంలో టెస్టింగ్‌ల సంఖ్యను పెంచాలని, ఇది వైరస్ నియంత్రణకు అత్యంత కీలకమన్నారు. కొరోనా నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలన్నారు. ముఖ్యంగా గ్రాణ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించిది.