Take a fresh look at your lifestyle.

నూతన సంవత్సరాది పూర్వాపరాలు

ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో సంవత్సరాది పండగను వివిధ దినాలలో జరుపుకుంటారు. ఇలా జరుపుకోవడానికి కారణం సంవత్సర పరిగణన వేరువేరు మాసాలలో జరగడమే. ప్రపంచంలో అత్యధికులు ఆచరించేది ప్రస్తుత గ్రెగేరియన్‌ ‌క్యాలెండర్‌ ‌క్రీ.శ.1582లో రూపొందించినది. జనవరి 1వ తేదీన నూతన సంవత్సర తొలి రోజును పండగలా జరుపుకోవడం సాపేక్షంగా కొత్త దృగ్విషయం.

క్రీ.పూ.2000లో వసంత సమరాత్రి సమయాన మార్చి మధ్య కాలంలో మెసపొటేమియాలో నూతన సంవత్సర ఉత్సవాలు తొలి నాళ్ళలో జరుపుకునే వారు. అలాగే వివిధ ప్రాంతాలలో రుతు సంబంధంగా ప్రాచీనులు విభిన్న రోజులలో సంవత్సరాదిని పాటించేవారు. ఈజిప్టియన్లు, ఫొయెనిషియన్లు, పర్షియన్లు సమర్రాతి ప్రారంభం, గ్రీకులు శీతకాల ఆయనాంత సమయాన జరుపుకునే వారు. పూర్వపు రోమన్లు మార్చి నెల 1వ తేదీని కొత్త సంవత్సర ఆరంభ దినంగా నియమం పెట్టుకున్నారు.

ఆనాటి క్యాలెండర్‌ ‌మార్చితో ప్రారంభమై 10నెలలతో కూడి ఉండేది. లాటిన్‌ ‌లో ‘’సెప్టెం’’ అనగా ఏడు అని, ‘’అక్టో’’ అనగా ఎనిమిది అని ‘‘నొవం’’ అనగా తొమ్మిది అని, ‘’దశం’’ అనగా పది అని అర్ధం. క్రీ.పూ.153లో ప్రప్రధమంగా జనవరి 1న నూతన సంవత్సర తొలి రోజుగా పరిగణించారు. వాస్తవానికి క్రీ.పూ.700 వరకు జనవరి మాసం ఉనికే లేదు. రోమ్‌ ‌రెండవ రాజైన నుర్మా పొంటిలియస్‌ ‌జనవరి, ఫిబ్రవరి మాసాలను జత చేయడం జరిగింది. రోమ్‌ ‌సామ్రాజ్యంలో పౌర యుద్ధం చోటు చేసుకుని, గణతంత్ర రాజ్యంలో ఇరువురు ఉన్నతాధికారులైన అమాత్యులు కొత్తగా ఎన్నికైన సందర్భాన వారి పదవీ కాలాన్ని ఏడాదిగా నిర్ణయించారు. ఆ సందర్భంగా మార్చి నుండి జన వరికి తొలి రోజును మార్చినా, అది ఖచ్చితంగా పాటించ బడలేదు. అప్పటికీ మార్చి 1ననే కొత్త సంవత్సర వేడుకలు జరిగేవి.

క్రీ.పూ.46లో జూలియస్‌ ‌సీజర్‌ ‌ప్రాచీన చాంద్రమానాధారిత రోమన్‌ ‌క్యాలెండర్‌ ‌ను మెరుగు పరిచి, సౌర మాన ఆధారిత నూతన క్యాలెండర్‌ ‌ను పరిచయం చేయగా, సదరు క్యాలెండర్‌ ‌జనవరి 1ననే కొత్త సంవత్సర ప్రారంభ దినంగా పరిగణింప చేయగా, అది క్రమేణ నిలకడగా పాటించ బడింది. మధ్యయుగాన ఐరోపాలో నూతర వత్సర సంబరాలు అన్యమత సంబంధమైనవిగా భావించ బడగా, క్రీ.శ.567లో జనవరి 1వ తేదీన నూతన సంవత్సర ప్రారంభ దినాన్ని పాల కులచే రద్దు చేయబడింది. మధ్యయుగ క్రైస్తవులు ఐరోపాలో చాలా వరకు కొత్త సంవత్సర దిన వేడుకలను జీసస్‌ ‌జన్మదిన సందర్భంగా డిసెంబర్‌ 25‌న, మార్చి 1న, మార్చి 25న, ఈస్టర్‌ ‌సందర్భంగా పాటించేవారు.

1582వ సంవత్సరంలో సంస్కరింపబడి, పునరుద్దరింప బడిన గ్రెగేరియన్‌ ‌క్యాలెండర్‌ ‌జనవరి 1వ తేదీని ప్రకటింపగా, వెనువెంటనే చాలా వరకు క్యాథలిక్‌ ‌దేశాలు స్వీకరించాయి. తర్వాత క్రమంగా ప్రొటెస్టెంట్‌ ‌దేశాలు కూడా స్వీకరించాయి. అయితే 1752 వరకు బ్రిటిషర్లు  స్వీకరించలేదు. అప్పటికీ బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం, వారి అమెరికన్‌ ‌కాలనీలు మార్చి మాసంలోనే నూతన సంవత్స వేడుకలు జరుపుకునే వారు. 1752 తర్వాత బ్రిటిష్‌ ‌రాచరిక పాలకులు తమ ఆధీనంలోని దేశాలన్నింటిలో జన వరి 1వ తేదీని నూతన సంవత్సర తొలి రోజుగా ఆచరించే చర్యలు గైకొన్నారు.

మొట్టమొదటి సారిగా గ్రెగేరియన్‌ ‌క్యాలెండర్‌ ‌కు, జూలియస్‌ ‌సీజర్‌ ‌క్యాలెండర్‌ ‌కు గల రోజుల వ్యత్యాసాన్ని సవరించి, 1582 అక్టోబర్‌ ‌మాసంలో 5 నుండి 14వ తేదీలను ఇటలీ, పోర్చుగల్‌, ‌స్పెయిన్‌, ‌పోలండ్‌ ‌దేశాలలో లేకుండా చేసి, 4తర్వాత 15ను మార్చడం జరిగింది. 1752 సెప్టెంబరులో 3నుండి 13 తేదీలు తొలగించి, 11రోజులను లేకుండా సరి చేశారు..
జనవరి 7 ఈజిప్టియన్లు, 11న ఓల్డ్ ‌స్కాటిష్‌,  14‌న ఈస్ట్రన్‌ ఆర్థడాక్స్, 21‌న కొరియన్లు, మార్చి 1న రోమన్లు, ఏప్రిల్‌ 13,14‌ను (బైసాకి) నానక్‌ ‌సాహి క్యాలెండర్‌ ఆధారంగా సిక్కులు, ఉగాదిని తెలుగువారు, ఏప్రిల్‌ 14‌ను అగ్నేయాసియా దేశాలు, ఏప్రిల్‌ ‌మొదటి వారంలో పౌర్ణమిని బౌద్ధులు, మొహర్రం నెల మొదటి రోజు ఇస్లాం, జూన్‌ 21‌ని ఏనిషియెంట్‌ ‌గ్రీక్‌, ‌జూలై 8ని ఆర్మేనియన్‌, ఆగస్టు 8ని మళయాళీలు, 23ను జొరాస్ట్రియన్‌, ‌సెప్టెంబర్‌ 1‌ని రష్యన్‌  ఆర్తడాక్స్ ‌క్రిస్టియన్‌, 11‌ను ఇథియోపియన్‌, అక్టోబర్‌ 3‌ను మొరాకో, నవంబర్‌ ‌లో దీపావళిని జైనులు, డిసెంబర్‌ ‌లో సిక్కిం న్యూ ఇయర్‌ ‌డేగా పాటించడం అనవాయితీ.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply