Take a fresh look at your lifestyle.

కొత్త సంవత్సరం..పాత సమస్యలు..!

Citizenship Amendment, National Population Register, List of National Citizensకాల గమనంలో మరో సంవత్సరం గడిచిపోయింది..2019 సంవత్సరం పోతూ మన ముందు పలు గంభీరమయిన సమస్యలను వొదిలిపెట్టింది. కాలమే అన్ని సమ్యలకు పరిష్కారం చూపుతుంది ..అనుకునే వారు లేకపోలేదు..! కాలం కూడా నిస్సహాయతను వ్యక్తం చేస్తుందా అన్న అనుమానం కలిగేలా సమస్యలు సృష్టించుకున్నాము. ఉన్న గీతను చిన్నదిగా చూపడానికి పక్కన పెద్ద గీత గీసిన చందంగా ఉన్నది మన పాలకుల పరిపాలన. 2019లో ప్రధానంగా దేశం మొత్తాన్ని కుదిపేసింది ‘దిశ‘ దుర్ఘటన. దుర్ఘటనకు దారి తీసిన మూలాలను మట్టు పెట్టకుండా.. సాక్ష్యాధారాలను తుడిపేసేలా..నిందితులను ఎన్‌ ‌కౌంటర్‌ ‌చేసి చేతులు దులుపుకున్నారు పోలీసులు. ఎన్‌ ‌కౌంటర్‌తో ఆత్యాచారం లాంటి నేరాలకు పాల్పడే వారు భయంతో అటువంటి దుశ్చర్యల జోలికి పోరని ఒక అభిప్రాయం..! అత్యాచారానికి పాల్పడ్డ నేరస్థులకు 21 రోజుల్లో శిక్ష పడేలా ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం ‘దిశ’ చట్టం చేసింది. దుర్ఘటనలు సంభవించిన తరువాత నేరస్థులకు శిక్షలు విధించే చట్టాల కంటే…అసలు దుర్ఘటనలకు ఉత్ప్రేరకాలుగా పని చేస్తున్న వాటి నిరోధానికి ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. ఆ ‘దిశ’గా ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. అత్యాచారాలకు మూలమయిన మద్యాన్ని నియంత్రించడంలో శ్రద్ధ కనబరుస్తున్నది. దశల వారీగా మధ్య నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తామని ముఖ్య మంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీ. దశల వారిగా ఈ హామీని 2020లో నిలబెట్టుకుంటారని ఆశిద్దాం.

2019లో రెండవ సారి కేంద్రంలో అధికారంలోకి వొచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆర్థిక మాంద్యం తరుముతున్నది. యువకులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో విఫలమయింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. స్థూల జాతీయోత్పత్తి కనిష్ట స్థాయికి పడిపోయింది. బ్యాంకింగ్‌ ‌వ్యవస్థపై సామాన్యులకు విశ్వాసం సన్నగిల్లుతుంది. జనాభాలో అత్యల్ప శాతం సంపన్నుల చేతుల్లో నగదు నిలిచిపోయింది. నగదు చలామణి లేక సామాన్యులు ముఖ్యంగా రైతులు అప్పుల పాలవుతున్నారు. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం ముందుకు తెచ్చింది. దానికి తోడు జాతీయ జనాభా రిజిస్టర్‌.. ‌జన గణన కోసం అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. అంతకు ముందు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టిన జాతీయ పౌరుల జాబితా(ఎన్‌ఆర్‌సీ) తీవ్ర దుమారాన్ని లేపింది. కేరళ, పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రాలు కేంద్రం చేసిన చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయమని అసెంబ్లీ తీర్మానాలు చేస్తున్నాయి. కుల, మతాల వారీగా ప్రజలను విభజిస్తున్న జాతీయ జనాభా రిజిస్టర్‌ను, ఒక మతంను లక్ష్యంగా సవరణ చేసిన పౌర సత్వ చట్టాన్ని దేశ వ్యాప్తంగా విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు.. విభిన్న రంగాల ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు. 2019 సంవత్సరంలో మోడీ ప్రభుత్వం అధికారం లోకి వొచ్చిన తరువాత జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాగ్రహాన్ని అధికార భారతీయ జనతా పార్టీ చవిచూడాల్సి వొచింది. ఆ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. చెప్పుతున్న లెక్కలకు వాస్తవంగా జరుగుతున్న పరిణామాలకూ పొంతన కుదరడం లేదు. రాష్ట్రాలు కూడా ఆర్థిక పరంగా తమకు రావాల్సిన నిధులు కేంద్రం నుండి రావడం లేదని కేంద్రం విధానాల పట్ల కేందం వ్యవహార శైలి పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్‌డిఏ -1 ప్రభుత్వంతో మితృత్వంగా ఉన్న పార్టీలు కూడా క్రమక్రమంగా దూర మౌతున్నాయి. 2019 సంవత్సరం వొదిలి పోతున్న పౌరసత్వ సవరణ, జాతీయ జనాభా రిజిస్టర్‌, ‌జాతీయ పౌరుల జాబితా సమస్యలకు 2020లో పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం.

Tags: dish encounter,disha act, Citizenship Amendment, National Population Register, List of National Citizens

Leave a Reply