Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులకు..వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు:మంత్రి హరీష్ రావు

జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్    ప్రెస్స్ క్లబ్ లో జరిగిన స్కాలర్ షిప్స్ పంపిణీ, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..జర్నలిస్టుల పిల్లలకు అందిస్తున్న స్కాలర్షిప్ లో భాగంగా ఏటా తన వంతుగా 5 లక్షలు ఇస్తానని  మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.జర్నలిస్టులు ఛాలెంజ్ గా పని చేస్తారు..
అని మంత్రి మాట్లాడుతూ..పండుగలు, సెలవులు సైతం వదులుకొని పని చేస్తుంటారు..ఎంతో కష్టపడి సమాజం కోసం పని చేస్తుంటారు..ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మీరు వారధిగా పని చేస్తారు..అని ప్రశంసించారు.జర్నలిజం ఒక గొప్ప వృత్తి, నిత్యం అప్డేట్ అవుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది..
సీఎం కేసీఆర్  జర్నలిస్టుల పై ప్రత్యేక దృష్టి సారించారు..జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేశారు..గతంలో ఎన్నడు లేనివిధంగా 20వేలకు పైగా అక్రిడేషన్లు మంజూరు చేశారు…ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు.జర్నలిస్టు ఇళ్ళ అంశం ముందుకు వెళ్తున్నది. త్వరగా పరిష్కారం అయ్యేలా నా వంతు కృషి చేస్తాను..అని మంత్రి హరీష్ రావు హామీ ఇస్తూ..బాలలత  5 లక్షలలతో స్కాలర్ షిప్స్ ఇస్తున్నారు..ఇప్పటి నుండి నేను కూడా 5 లక్షలు ప్రతి ఏటా జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్ షిప్స్ ఇచ్చేందుకు తోడ్పాటు అందిస్తాను..తెలంగాణ ప్రభుత్వం, బి కేటగిరీలో రిజ్వేషన్ తేవడం వల్ల 1071 మంది తెలంగాణ పిల్లలు నేడు ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందారు. ఇది గొప్ప విషయం..ఇందులో జర్నలిస్టు పిల్లలకు కూడా సీట్లు రావడం గొప్ప విషయం…ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. పీజీ స్థానాల్లో 2 వ స్ధానం, దేశంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ 3 వ స్థానములో ఉంది…ఉద్యమ సమయంలో మీ సహకారం మేము మర్చిపోలేను.మీరు ఎంతో సహకరించారు…జర్నలిస్టుల కష్టాలు తీర్చడంలో మీ అందరికీ అందుబాటులో ఉంటాము. ఆర్థిక, అరోగ్య మంత్రిగా నా తోడ్పాటు అందిస్తాను..అని మంత్రి హామీ ఇచ్చారు.

Leave a Reply