Take a fresh look at your lifestyle.

కొత్త ప్రపంచం

పడిలేచే కడలి కెరటంలా..
ఉదయం వెనుక ఉదయం
కాచుకొని వుంటుంది..

సాయంకాల సంధ్య
అదృశ్యమవుతూ అస్తమిస్తుంటుంది..

రాత్రి పగలు రణం చేస్తూ
అలసిపోతుంటాయి

నిన్న మొన్నటి దాక
ఒకరి వొడిలో ఒకరు
సేదతీరిన బంధాలు
అంతు పట్టని వ్యాధికి
అతలాకుతమవుతూ..
మానవ సంబంధాలు
మట్టి శితిలాల అడుగున
దోబూచులాడుతున్నవి..

కనికరం లేని రాగ ద్వేషాలు
కళ్ళముందు తమవారి ప్రాణాలు
గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతుంటే
మృత్యుఘోష తాండవాన్ని కళ్ళప్పిగించి
చూస్తూ.. ఏంచేయలేని నిస్సహాయ స్థితి లో
కఠిన శిలలవుతున్నాయి

మమతను రాగాలను వెలివేసిన
డాలర్ల మోజులో..
అంటరానితనమైన కన్నప్రేగు బంధం
అల్లాడిపోతుందీపుడూ..
ఎదురు చూసి అలసి పోయి
చివరి చూపుకు నోచుకోక
రాని బిడ్డల క్షేమాన్ని అరదీస్తుందీ

గ్లోబలైజేషన్‌ ‌ప్రపంచీకరణలో
మనిషి అస్తిత్వమే ప్రశ్నర్థకమై..
వైజ్ఞానిక పరిశోధనలు.. సాధిస్తున్న
ప్రగతి కి సవాళ్లు విసురుతూ..
మనిషి మానవ వికాస చైతన్యం
చెదలు పట్టిన పాత గోడల
తలుపులవుతున్నాయి

పట్టింపులతో పగలతో
రాజ్యకాంక్షతో ప్రజల గొంతుల్ని
చట్టాల ముసుగులో నొక్కి పెడుతూ
కొనఊపిరితో కొండెక్కిన దీపం వొత్తిలా..
మనిషి ఆశ గిజ గిజలాడుతోంది

ఇకనైనా మనిషి తనలోని మనిషిని
మేల్కొపి .. మార్కెట్‌ ‌శక్తులకు తలొగ్గాక.
మానవ సమాజ పునరికరణకు.
కంకణ బద్ధులై ఉద్యమించాలి

కొరోనా ఎడారిలో ఇసుక తుపానుల
కాటుకి బలైన ప్రేమానురాగాలతో..
ఒయాసిస్సులా పూలు పూయించాలి

బంధాలు అనుబంధాల సరిహద్దుల్ని
చెరిపివేసినా మనిషి అంతరంగంలో
మళ్ళీ చిగురులు తొడగడానికి
తొలకరి మేఘాలై పురుడు పోసుకుంటున్న
రేపటి కొత్త ప్రపంచం
మానవత్వపరిమళాలకి
ఆలంబన కావాలి.
జై హింద్‌
– ‌రవీందర్‌ ‌కొండ, 9848408612
అల్వాల్‌, ‌హైదరాబాద్‌

Leave a Reply