Take a fresh look at your lifestyle.

బీహార్‌ ఎన్నికల్లో నవ విప్లవకారులు

“కమ్యూనిస్టు పార్టీల్లోకి యువత రావడం లేదన్న విమర్శ ఎప్పుడు బలంగా వినిపిస్తూ ఉంటది. కానీ ఈసారి బీహార్‌ ఎన్నికల్లో మాత్రం కమ్యూనిస్టులు ఐక్యంగా పోటీ చేస్తూ ఉండడం దాంట్లోనూ నవతరానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల్లో నిలపడం ఆ పార్టీలలో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది.”

బీహార్‌ ఎన్నికల్లో నవతరం గుబాళిస్తుంది. బూర్జువా పాలక పార్టీల్లో యువత ప్రాధాన్యత ఎలా ఉన్నప్పటికీ కామ్రేడ్లలో మాత్రం యువతరం ప్రవాహం కొనసాగడం నవ భారతానికి మేరు నగదీరులను అందించడమే అవుతుంది. కమ్యూనిస్టు పార్టీల్లోకి యువత రావడం లేదన్న విమర్శ ఎప్పుడు బలంగా వినిపిస్తూ ఉంటది. కానీ ఈసారి బీహార్‌ ఎన్నికల్లో మాత్రం కమ్యూనిస్టులు ఐక్యంగా పోటీ చేస్తూ ఉండడం దాంట్లోనూ నవతరానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల్లో నిలపడం ఆ పార్టీలలో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. అక్కడ ఎన్నికల రణరంగంలో నవ కామ్రేడ్లు కుస్తీ పడుతూ ప్రత్యేక ఆకర్షణగా అభ్యర్థులు కనిపిస్తున్నారు. వామపక్షాలు పరిమిత స్థానాల్లోనే (29) పోటీ చేస్తున్నప్పటికీ అత్యధిక సీట్లు గెలుపుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో అనుభవం ఉన్న పోరాటయోధులతో పాటు యువతరం ఎన్నికలను ఎదుర్కొంటున్నది.  విద్యార్థి రంగంలో, యువజన రంగంలో పనిచేస్తున్న రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు పోటీలో నిలిచారు. వారిలో విప్లవ యువజన సంఘం(ఆర్‌.‌వై.ఏ) ముఖ్య నేతలు ఉన్నారు. సిపిఐ(ఎంఎల్‌) ‌లిబరేషన్‌ ‌నుండి పోటీ చేసి యువతను ప్రభావితం చేస్తున్నారు. అనగారిన తరగతుల ప్రతినిధులుగా, ధిక్కార స్వరాలుగా ముందుకు సాగుతున్నారు.

పాట్నాలో విద్యార్థి నేత సౌరబ్‌ ‌సందీప్‌

image.png

‌పాట్నాలోని పాలిగంజ్‌ ‌నియోజకవర్గం నుంచి ఆల్‌ ఇం‌డియా స్టూడెంట్‌ అసోసియేషన్‌ (ఐసా) ప్రధాన కార్యదర్శి, మాజీ జవహర్లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) ఎస్‌.‌యూ ప్రధాన కార్యదర్శి సందీప్‌ ‌సౌరబ్‌ ‌పోటీలో ఉన్నారు. విద్యా కషాయికరణకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సందీప్‌ ‌సిపిఐ (ఎంఎల్‌) ‌లిబరేషన్‌ అభ్యర్థిగా ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

సివాన్‌ ‌లో యువ నేత అమర్‌జీత్‌ ‌కుష్వాహా
image.png

సివాన్‌లోని జీరదేయి నియోజకవర్గం నుండి విప్లవ యువజన సంఘం (ఆర్‌వైఏ) గౌరవ జాతీయ అధ్యక్షుడు అమర్‌జీత్‌ ‌కుష్వాహా సిపిఐ (ఎంఎల్‌) అభ్యర్థిగా రంగంలో నిలిచారు. నిరుద్యోగ సమస్యపై ఆయన అలుపెరుగని పోరాటాలు చేశారు. యువజన రంగంలో సీనియర్‌ ‌నాయకుడు.

అగియాన్లో  మనోజ్‌ ‌మన్జిల్‌
‌రివల్యూషన్‌ ‌యూత్‌ అసోసియేషన్‌ ‌జాతీయ అధ్యక్షుడు  మనోజ్‌ ‌మన్జిల్‌ ‌కొనసాగుతున్నారు. జాతీయ స్థాయిలో పని చేస్తూ గుర్తింపు సాధించారు. భోజ్‌పూర్‌లోని అగియాన్‌ (‌రిజర్వు) స్థానం నుంచి పోటి చేస్తున్నారు. దళిత, పేద విద్యార్థుల కోసం పోరాటాలు నిర్వహించారు. విద్యా హక్కుల ఉద్యమ నాయకుడుగా ఆయనకు పేరుంది.
డుమ్రాన్‌లో అజిత్‌ ‌కుమార్‌
image.png

‌బక్సర్‌ ‌జిల్లా డుమ్రాన్‌ ‌నుండి ఆర్వైఏ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ యువ నాయకుడు అజిత్‌ ‌కుమార్‌ ‌సింగ్‌ ఎన్నికల బరిలో ఉన్నారు. నిరుద్యోగ సమస్యపై యువతను కదిలించి ఉద్యమబాట పట్టించారు ఆయన. ప్రజాదరణ కలిగి ఉన్నారు. కోవిడ్‌ ‌లాక్డౌన్‌ ‌సమయంలో సహయ చర్యలకు నాయకత్వం వహించారు.

సమస్తిపూర్‌ ‌నుంచి అఫ్తాబ్‌ ఆలం
image.png

ఆరైలోని సమస్తిపూర్‌ ‌నుండి ఇన్సాఫ్‌ ‌మంచ్‌ ‌స్టేట్‌ ‌వైస్‌ ‌ప్రెసిడెంట్‌ అఫ్తాబ్‌ ఆలం ఎన్నికల బరిలో ఉన్నారు. అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు.

గోపాల్‌ ‌గంజ్‌లో జితేంద్ర

image.png

ఆర్వైఏ యువ నాయ కుడు, ఉపాధ్యక్షుడు జితేంద్ర పాస్వాన్‌ ‌భోరే (గోపాల్‌ ‌గంజ్‌) ‌రిజర్వడ్ ‌స్థానానికి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అహ్మదాబాద్‌ ‌నుండి ఉనా వరకు దళిత పోరాటాలకు నాయకత్వం వహించారు. బీహార్‌ ‌వరదలు, లాక్డౌన్‌ ‌సమయంలో వలస కార్మికుల కోసం పని చేశారు.

కళ్యాణ్‌ ‌పూర్‌ ‌రంజిత్‌ ‌రామ్‌
‌మరో యువ నాయకుడు రంజిత్‌ ‌రామ్‌ ‌సమస్తిపూర్‌ ‌లోని కళ్యాణ్పూర్‌ (‌రిజర్వు) స్థానం నుంచి పోటి చేస్తున్నారు. వ్యవసాయ కార్మికుల కోసం పోరాటాలు చేశారు. 2003లో దర్భంగలో ఐసా నాయకుడిగా అప్పటి హోంమంత్రికి నల్ల జెండాలు చూపారు. దేశద్రోహం చట్టం కింద వేధింపులకు గురయ్యారు. కమ్యూనిస్టు కంచుకోటల నుంచి వీరందరు పోటి చేస్తున్నారు. ఎర్రజెండాను గుండెల్లో దాచుకున్న విప్లవ కేంద్రాలవి. అక్కడి నుండి నవతరం విప్లవకారులుగా బీహార్‌ అసెంబ్లీలో అడుగు పెట్టి కొత్త చరిత్రను సృష్టించనున్నారు. భారత విప్లవోద్యమానికి వీరు ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నారనే భావన విప్లవ కారుల్లో వ్యక్తమవుతుంది.
– మామిండ్లరమేష్‌ ‌రాజా,  7893230218

Leave a Reply