గవర్నర్ ఆమోద ముద్ర, ఉత్తర్వులు జారీ చేసిన న్యాయశాఖ
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చింది. కొత్త రెవెన్యూ విధానంలో భాగంగా భూమి హక్కులు, పట్టాదార్ పాసు పుస్తకాల చట్టంతో పాటు వీఆర్వో పోస్టుల రద్దు చట్టాలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఇటీవల అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లులను ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో ఈ బిల్లులకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ఆమో• •ముద్ర వేయడంతో చట్టాలుగా మారాయి.
ఈ మేరకు అమలులోకి వచ్చిన చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 19న గెజిట్ నోటిఫికేషన్లను ప్రచురించారు. ఇందుకు అనుగుణంగా న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ బీపాస్ చట్టంతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, పురపాలక, పంచాయతీరాజ్, జీఎస్టీ చట్ట సవరణ చట్టాలు కూడా అములలోకి వచ్చాయి.