Take a fresh look at your lifestyle.

నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం

*ఇకపై తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ శాస్వతంగా రద్దు
*ఎమ్మార్వోలకు వ్యవసాయ భూముల రిజిస్టేష్రన్‌ ‌విధులు
*ధరణి పోర్టల్‌లోనే కొనసాగనున్న రిజిస్టేష్రన్ల పక్రియ
*ధరణి పోర్టల్‌లో అటవీ భూమలకు కాలమ్‌
*‌ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధరణి పోర్టల్‌ ‌నిర్వహణ
*దేవాదాయ,వక్ఫ్ ‌భూముల రక్షణకు తక్షణ చర్యలు
*వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌బుక్‌
‌*వ్యవసాయేతర భూములకు ముదురు ఎరుపు పాస్‌బు
*కౌలుదారులకు చెక్‌ ‌పెడుతూ అనుభవదారు కాలం ఎత్తివేత
*సుదీర్ఘ చర్చ అనంతరం ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదం
*బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హర్షం 

- Advertisement -

‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లు  శాసనసభ స్పీకర్‌ ‌పోచారం ప్రకటించారు. బిల్లు ఆమోదం కోసం మూజువాణి ఓటింగ్‌ ‌ప్రక్రియను చేపట్టారు.  దీంతో ఇకపై తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ శాస్వతంగా రద్దు కానుంది. ఇకపై ఒకేసారి రిజిస్టేష్రన్‌, ‌మ్యూటేషన్‌ ‌పక్రియ కూడా జరుగనుంది. కొత్త చట్టం ప్రకారం ఎమ్మార్వోలే వ్యవసాయ భూముల రిజిస్టేష్రన్‌ ‌విధులు నిర్వర్తించ నున్నారు. అంతేకాకుండా ఇకపై తెలంగాణ ధరణి పోర్టల్‌లోనే రిజిస్టేష్రన్ల పక్రియ కొనసాగనుంది. బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక చట్టమని అన్నారు. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన చర్చలో కాంగ్రెస్‌, ఎంఐఎం,‌భాజపా సభ్యులు తమ సలహాలు, సూచనలు చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ ‌దానిపై సమాధానమిచ్చారు. బిల్లులో పొందుపర్చిన అంశాలపై సీఎం సుదీర్ఘంగా వివరించారు. అనంతరం నూతన రెవెన్యూ బిల్లుకు సంబంధించి తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుబుక్‌ల బిల్లు-2020ను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అనంతరం శాసనసభను స్పీకర్‌ ‌సోమవారానికి వాయిదా వేశారు. ఈసందర్భంగా సిఎం కెసిర్‌ ‌మాట్లాడుతూ రాష్ట్రంలో భూ వివాదాలకు సమగ్ర సర్వేతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. 99 శాతం సమస్యలకు సర్వేనే పరిష్కారం చెబుతుందని ఆయన పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో సీఎం కేసీఆర్‌ ‌వివరణ ఇచ్చారు.

Leave a Reply