Take a fresh look at your lifestyle.

ప్రజలకు మేలు చేసేందుకే.. కొత్త రెవెన్యూ చట్టం

  • ఇకపై తహశీల్దార్లే జాయింట్‌ ‌రిజిస్ట్రార్‌లు, రెవెన్యూ కోర్టులు రద్దు
  • వీఆర్వోలను స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తిస్తాం
  • కొత్త చట్టంతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం
  • త్వరలో డిజిటల్‌ ‌మ్యాపులు తయారు చేస్తాం
  • మూడేళ్లుగా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాం
  • పూర్తి పారదర్శకంగా ధరణి పోర్టల్‌
  • ‌రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికీ ఈ బిల్లు వర్తిస్తుంది
  • అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

ఎప్పుడో బ్రిటీషు కాలంలో తయారైన రెవెన్యూ చట్టంతో ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదనీ, ప్రజలకు మేలు చేసేందుకే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కొత్త చట్టంతో రెవెన్యూ శాఖలో ఉద్యోగుల భద్రతకు ఢోకా లేదనీ, ఏ ఒక్క ఉడ్యోగినీ తొలగించబోమనీ హామీ ఇచ్చారు. కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వీఆర్వోలు ఎలాంటి ఆందోళనా చెంద వద్దనీ, వారిని స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్‌ ‌శాసనసభలో చ•రిత్రాత్మక రెవెన్యూ బిల్లు 2020 వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌మాట్లాడుతూ అవినీతి అంతం కోసమే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి రైతులు, పేదలకు సరళీకృతమైన కొత్త చట్టాన్ని సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికీ ఈ బిల్లు వర్తిస్తుందనీ, నవీన కాలంలో అనేక ఉత్పత్తి సాధనాలు వచ్చాయనీ, మనిషి జీవితం భూమి చుట్టూ తిరిగిందనీ, జీవనోపాధి కోసం వ్యవసాయం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించడంతో దాని విలువ పెరిగిందని చెప్పారు. నేటికి కూడా భూ సమస్యలు ఉన్నాయనీ, భూ సంస్కరణలు అనేవి ఒక పద్దతిలో చానలైజ్‌ ‌చేయాలనీ, ఈ క్రమంలో తెలంగాణలో అనేక రెవెన్యూ సంస్కరణలు జరిగాయన్నారు.

పీవీ నరసింహారావు, ఎన్టీయార్‌, ‌చంద్రబాబు, వైఎస్‌ ‌హయాంలో కొన్ని మార్పులు జరిగాయనీ, అయినప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలకు సరైన పరిష్కార• లభించలేదన్నారు. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులపై గతంలో అనేకమార్లు దాడులు జరిగాయని గుర్తు చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మూడేళ్లుగా కృషి చేస్తున్నామనీ, ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించేందుకే ఈ ప్రయత్నమని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు. త్వరలో డిజి•ల్‌ ‌మ్యాపులు తయారు చేస్తామనీ, అది కూడా కంప్యూటర్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతాయని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. తెలంగాణలో భూముల విలువ పెరిగింది ఈ కారణంగా భవిష్యత్తులో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వపై భారం పడినప్పటికీ రెవెన్యూ సంస్కరణకు చేపట్టామని సీఎం కేసీఆర్‌ ‌వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టం ద్వారా అవినీతి అంతమవుతుందనీ, భూ మాఫియా నుంచి పేద ప్రజలకు ఈ చట్టంతో రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం అంగుళం భూమి కూడా ఇతరులు ఆక్రమించలేరనీ, డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌టెక్నాలజీ విధానంలో రికార్డులు భద్రంగా ఉంటాయని చెప్పారు. ధరణి పోర్టల్‌ ‌ద్వారా కావాల్సిన వారు ఎవరైనా వివరాలను డౌన్‌లోడ్‌ ‌చేసుకోవచ్చన్నారు. క్రయవియ్రకాలను రిజిస్ట్రేషన్‌ ‌చేసిన వెంటనే పోర్టల్‌లో అప్‌లోడ్‌ అవుతాయనీ, ఎవరు ఎక్కడ ఉన్నా ఉన్న చోట నుంచే ఆస్తుల వివరాలు చూసుకోవచ్చని తెలిపారు. గ్రామ కంఠం, పట్టణ భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తామనీ, రిజిస్ట్రార్‌ ‌కార్యాలయంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు, తహశీల్దార్లకు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ ‌చేసే అధికారం ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నా మన్నారు. ఇక నుంచి తహశీల్దార్లే జాయింట్‌ ‌రిజిస్ట్రార్లనీ, ఏమైనాసమస్యలుంటే న్యాయ విభాగం కోర్టులు పరిష్కరిస్తాయని వెల్లడించారు. ఇక నుంచి రెవెన్యూ కోర్టులు ఉండవనీ, తెలంగాణ రాష్ట్రంలో 2.75 కోట్ల ఎకరాల భూమి ఉందనీ, కొత్త చట్టంతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. ఇకపై రాష్ట్రంలో 99.99 శాతం భూ వివాదాలు ఉండవనీ, భూ వివాదాలపై తహశీల్దార్‌, ఆర్డీవో, జేసీలు ఆర్డర్‌ ఇస్తారని చెప్పారు. వీఆర్‌ఏలలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారనీ, వారికి స్కేల్‌ ‌పోస్టులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అనివార్య కారణాలతోనే వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామనీ, ఈ కొత్త చట్టంతో ఏ ఒక్క వీఆర్వో ఉద్యోగాన్నీ తొలగించబోమని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply