రాష్ట్రంలో కొరోనా పాజిటివ్ కేసులు మంగళవారం క్రితం రోజుకన్నా కొద్దిగా పెరిగాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1556 మందికి పాజిటివ్‌గా నమోదు కాగా, వైరస్ నుంచి 2070 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 14 మంది మృతి చెందారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 182 కేసులు నమోదవగా, నల్గొండలో 135 కేసులు, ఖమ్మం జిల్లాలో కొత్తగా 131 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,06,436 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,510కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,82,993 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 19,933గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.