Take a fresh look at your lifestyle.

నూతన వెలుగు జిలుగుల సంక్రాంతి..

సంక్రాంతి అనగానే ఆనందాల పండుగ. మూడు రోజుల ముచ్చటగా జరుపుకునే పెద్ద పండగ. పిల్ల, పాపలు, పెద్దలు ఒక చోట కలిసి మెలిసి జరుపుకుంటు…రక రకాల వంటలు,నోరూరించే తీపి పదార్థాలు చేసుకుని ఆరగించే ముగ్గుల పండుగ.ప్రతీ ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు స్వాగతం పలుకుతూ డూ డూ బడవన్నల మేళతాళాలతో,హరిదాసు కీర్తనలతో పసందుగా జరుపుకుంటున్న పండుగగా గుర్తింపు వుంది.ఎక్కువగా తెలంగాణా రాష్ట్రం కన్న ఆంద్ర ప్రదేశ్‌ ‌ప్రజలు ఇష్టం గా జరుపుకుంటున్న పండుగగా అభివర్ణించవచ్చు.మన జీవితాలలో కమ్ముకొన్న చీకట్లను తరిమికొట్టి, చేదు జ్ఞాపకాలకు చరమగీతం పాడి కొంగొత్త,తీయటి అనుభూతులను పట్టుకువచ్చే సంక్రాంతికి నీరజనాలు.ఉమ్మడి తెలుగు ప్రజానీకం యావత్తుకు,ప్రతి ఇంటిల్లిపాదికి ముఖ్యంగా హిందూ సోదరులకు,సోదరీమణులకు సంక్రాంతి పండుగ అంటే అది ఓక అంతులేని అనుభూతూలను, సరికొత్త,తీయటి అనుభవాలను తెచ్చిపెట్టె పండుగ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

అయితే అనాదిగా మన పూర్వీకుల కాలం నుంచి ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులు అంటే బోగి, మకర సంక్రాంతి,కనుమ పండుగలు గా జరుపుకోవడం ఒక అనవాయితీగా వస్తున్నది. మొదటగా బోగి పండుగను గతంలో ఎదురైనా చేదు అనుభవాలను,ఓటములను, అవహేళనలను,అలాగే మన ఇంట్లో వున్న పాత వస్తువులను, వ్యర్థ పదార్థాలను బోగి మంటల్లో వేస్తే ఇక రాబోయేది అంతా మంచి కాలమే అని భావిస్తారు. ఇక రెండవ రోజు అంటే మకర సంక్రాంతి ప్రతి ఇంటివారు తమ తమ అల్లుళ్లను ఇంటికి పిలిచి మర్యాదలు చేయడం, ప్రతి ఇంటికి హరిదాసు వచ్చి హరినామ స్మరణ చేయడం ఆయా ఇంటి వారు తమ శక్తి మేర ఇచ్చే కాయో, ఫలమో స్వీకరించడం, ఇక గంగిరెద్దు వాళ్ళు వచ్చి వాటిని ఆడిస్తూ రైతులు పండించిన పంటలకు సంబంధించి కొత్త బియ్యం,ఏదేని ధాన్యం ను వారి స్వగృహం నుంచి పట్టుకెళ్లడం,పిల్లలు పతంగులు ఎగుర వేయడం మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక ,సాంప్రదాయ•గా వస్తున్నది. ఇక మూడవ రోజు విషయానికి వస్తే ఇది ప్రత్యేకంగా రైతు సోదరులకు సంబంధించిన పండుగ కనుమ,ఎందుకంటే సంవత్సం•• యావత్తు తమతో పాటు తమ వ్యవసాయ క్షేత్రంలో ధాన్యం పండటానికి ఎంతో కృషి చేసిన పశుపక్షాదులు,వృషభాలను మరియు పసులకు,వృషభాలకు ఆశ్రయం కల్పించిన పశుశాలను అత్యంత పరిశుభ్రంగా కడిగి వాటికీ బొట్టు పెట్టి మరీ రైతు సోదరులంతా వాటికీ కృతజ్ఞత తెలియజేయడం ఒక గొప్ప విషయంగా, విశేషంగా చెప్పవచ్చు.

ఇంకా చెప్పుకుంటూ పొతే ఈ సంక్రాంతి పండుగ ముఖ్యం అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే గతాన్ని పాతి పెట్టి, గతంలో తెలిసో తెలియకో చేసిన పొరపాట్లకు మరోసారి తావివ్వకుండా ఒక గొప్ప మార్పుకు ఆహ్వానం పలుకుతూ, సరికొత్త నూతన వెలుగు జిలుగులు ప్రసరింప జేసే, విరజిమ్మే ఈ సంక్రాంతికి నీరాజనాలు పట్టడం. ఏది ఏమైనా ఇంత కాలం ప్రజానీకం జీవితాలలో కమ్ముకున్న కారు చీకట్లు అన్ని తొలగిపోయి వారి విలువైన జీవితాలు ముఖ్యంగా సామాన్య ప్రజలు వారి వారి పిల్లాపాపలతో సుఖ, సంతోషాలతో ఏ లోటు లేకుండా వర్ధిల్లేలా చేయాల్సిన గురుతరబాధ్యత ఈ సంక్రాంతి సందర్బంగా అందరి మీద వుంది. ఏమైనా ఈ ప్రత్యేక 2022 సంవత్సరం మన రాష్ట్రపాలన బాగా సాగిపోయి జీవితంలో ఒక వెలుగు వెలగాలని ఈ సంక్రాంతి పర్వదినాన మనమంతా మనసా,వాచ, ,ఆత్మీయపూర్వకంగా కోరుకుందాం.ఈ సందర్బంగా ఉమ్మడి తెలుగు ప్రజానీకం యావత్తు కు సంక్రాంతి శుభాకాంక్షలు..కొరొనా నిబంధనను పాటిస్తూనే పండుగ ని జరుపుకుందాం…మాస్క్ ‌లు ధరించుదాం…భౌతిక దూరం పాటించుదాం.కొరొనా కట్టడి చేసేల ఆనందంగా  జరుపుకునెలా జాగ్రత్తలు తీసుకోవాలి.

– కామిడి సతీష్‌ ‌రెడ్డి,
జడలపేట జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా

Leave a Reply