Take a fresh look at your lifestyle.

నవజీవన వేదం..!

కంటిలో  రెటీనా పొరను
కరెన్సీ తెరలు కమ్మినాక
నీ ప్రతి వీక్షణంలో..
కపటపు క్రీనీడలు తప్పా !
కరుణ కాంతికి జాడెక్కడిది ?

మస్తిష్కవేళ్ళ మొదళ్లలో
మౌఢ్యకుళ్లు అల్లుకున్నాక
నీ ప్రతీ ఆలోచనలో…
అంతరాల దొంతరలే తప్పా!
సమైక్య జీవనకు చోటెక్కడిది?

నవనాడులు మూలాల్లో
స్వార్థ వ్యర్థాలు పోగయ్యాక
నీ ప్రతీ అడుగులో..
విద్రోహ ముద్రికలే తప్పా !
విశాల భావనకు దారెక్కడిది?

హృదయ అంతరాల్లో
విద్వేష సెగలు పెట్రేగినాక
నీ ప్రతీ చేతల్లో..
విధ్వంషకర శకలాలే  తప్పా!
విశ్వజనీన ప్రేమకు రేవెక్కడిది?

ఆధునికున్నని తెగ మురిసి
అడ్డదారులు తొక్కే మనిషి !

ఇప్పటికైనా.
వినాశక విపరీత పోకడల
విషవేళ్ళ మూలాలు పెరికి

నీ అంతరంగ క్షేత్రంలో
మానవీయ సేద్యం చేస్తే

నీ ఆశయాల్లో..
నవజీవన వేదం ప్రస్ఫుటిస్తుంది

నీ అడుగులో…
నవవికాస నాదం ప్రతిధ్వనిస్తుంది

   – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply