Take a fresh look at your lifestyle.

నూతన ఆవిష్కరణలు ఇంకా రావాలి: మంత్రి హరీష్‌రావు

ఆధునికతకు అద్దం పడుతూ నూతన ఆవిష్కరణలు ఇంకా రావాలని, యువత స్వశక్తితో ఎదిగి నలుగురికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు ఆకాంక్షించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సుడా కార్యాలయంలో సోమవారం  షైన్‌ 5‌జీ ఎనర్జీ ఎఫిషియంట్‌ ‌ఫ్యాన్‌ ‌మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

కేవలం 25 వాట్స్ ‌మాత్రమే ఖర్చు, రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌తో నడిచి 65 శాతం కరెంటు పొదుపు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఇలాంటి నూతన ఉత్పత్తులకు తెలంగాణ దిక్సుచి కావాలని మంత్రి ఆకాంక్షిస్తూ., షైన్‌ 5‌జీ ఫ్యాన్‌ ‌కంపనీ డైరెక్టర్‌ ‌మహాలక్ష్మి, పవన్‌ ‌కళ్యాణ్‌ ‌లను మంత్రి అభినందించారు. యువత మరిన్ని ఆవిష్కరణలతో ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

Leave a Reply