Take a fresh look at your lifestyle.

కొత్త భూమి

తొలి వేకువ ఉషస్సులో
భూమి పద్మాసనముతో
ధ్యానిస్తున్నది

చిగురిస్తూ విస్తరిస్తూ
విరభూస్తున్న విరుల
వర్ణాల వనాలను
కొత్త దుస్తులుగా ధరిస్తున్నది

పగటి వేళ కాల పురుషుని
సప్త వర్ణ కాంతి కౌగిలిలో
వెచ్చబడి రూఢిగా నిద్రపోతున్నది

రాత్రివేళ అనంత నక్షత్రాల స్వర్గంలో
చీకటి దుప్పటి కప్పుకుని
ఆమె నిద్రపోతున్నది
సడి రాత్రి నిద్రలేసి సందమామతో
మధుర రాగాలను అలపిస్తున్నది

హితం కోరే వన్య ప్రాణులను
ఎదపై  లాలిస్తున్నది
అరిష్వడ్గర్గ  ప్రాణులలో
కరోనాస్త్రాన్ని సంధించి
కలవరాన్ని కలిగిస్తున్నది
నగరాలను గ్రామాలను
కూడళ్లను కుటీరాలను
కూపంలో నెట్టేస్తున్నది

హరిణి నేత్ర సవ్వడులతో
సుమా హృదయ పక్షులతో
లావణ్యపు పత్రాల
హసిత మర్మర ధ్వనులతో
నది సంద్రాల అలల పొంగులతో
నిత్య వసంతాన్ని నింపుకుంటున్నది.

ఇంద్రియ లాలస జాతియంతా
దయగా మారే వరకు
నిర్దయగా ఉంటానంటున్నది
కలత లేకుండా భూమి కమ్మని
నిద్ర పోతున్నది
హేతువుతో జ్ఞానంతో
ప్రణతితో ప్రభాతం మేల్కొలిపేవరకు

Asnala srinivas
అస్నాల శ్రీనివాస్‌,
‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం
9652275560

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply